నటి విజయలక్ష్మీ
కర్ణాటక, యశవంతపుర: శాండల్‌వుడ్ నటీమణి ఆరోగ్యం బాగాలేక, ఆర్థిక సమస్యలతో సాయం కోసం నిరీక్షిస్తోంది. నాగమండల, సూర్యవంశ, నంబర్ ఇన్ సినిమాలలో నటించిన నటి విజయలక్ష్మీ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సాయం చేయాలని ఆమె సోదరి అభిమానులకు విన్నవించారు. ఇటీవల బుల్లితెరపై బిజీగా ఉన్న విజయలక్ష్మీ నీరసం, అధిక రక్తపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ఆమె తల్లికీ అనారోగ్యం రావటంతో ఆమె చికిత్సకు పెద్దమొత్తంలో డబ్బులను ఖర్చు చేశారు. ఇప్పుడు విజయలక్ష్మికీ అనారోగ్యం తలెత్తింది. తన అక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున చికిత్సకు అర్థిక సాయం చేయాలని ఆమె సోదరి ఉపాదేవి మనవి చేశారు. టీవీలు, సినిమాలలో అవకాశాలు సన్నగిల్లడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని సమాచారం. దీనితో చిత్రరంగ నటీ, నటులు చేయూతనివ్వాలని ఉషాదేవి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment