పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దాపురంలోని సత్తెమ్మ కాలనీకి చెందిన వై. విజయలక్ష్మి (30) భర్త ఇటీవల మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మానసికస్థితి సరిగా ఉండటం లేదు. అయితే ఆదివారం రోజున విజయలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, విజయలక్ష్మికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.