ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్‌ను జడ్జీలు అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్.. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని, యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రియాజ్. ఈ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, దాడులు చేశారని పేర్కొన్నారు. కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని మండిపడ్డారు.
కోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఆయన అంతగా నచ్చితే జడ్జీలంతా వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయారు.
దీంతో ప్రజలంతా శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హింసకు పాల్పడింది ఒవరో నిర్ధారించుకోకుండా పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు.
చదవండి: అమ్మో హాజీ! పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న డ్రగ్ కింగ్.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్...
Comments
Please login to add a commentAdd a comment