వేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన సినిమా ‘ఆ నిమిషం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళా రాజేష్ మాట్లాడుతూ.. ఆడపిల్లని స్వాగతించండి వారిని సంరక్షించండి ఆడపిల్ల ఏ దేశానికైనా నిజమైన ఆస్తి. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. నేడు ఆడపిల్ల విలాస వస్తువుగా చూస్తున్న వాళ్ళు ఆడపిల్ల పుడితే పురిటీలోనే గొంతు నొక్కుతున్నారు. ఆడపిల్లల బర్త్ రేటు గణనీయంగా తగ్గుతుంది.
సమాజంలో ఎన్నో మార్పులొస్తున్నా కూడా ఆడపిల్లని పురిటీలోనే చంపేయడం అనేది చాలా దారుణం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమాజానికి భవిష్యత్ అనేది ఉండదు. విద్యా సంస్థలలో పనిచేస్తున్న నేను నా మిత్రులు కలసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అన్నారు.
నటులు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్, ట్రైలర్స్ బాగున్నాయి. దర్శకుడు నిర్మాత అంతా కొత్త వారు అయినా... మంచి కథతో నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. బేబీ రోహి సంజన, బేబీ నన్నీనటన ఆకట్టుకుంటుంది. మార్చి 15న విడుదలవుతున్న ఈ సినిమా మంచి హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను అన్నారు. మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలని సినిమా ఘన విజయంసాధించాలని హీరో ప్రసాద్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment