
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్ రేపు(శుక్రవారం) బంజారాహిల్స్ పోలీస్ స్టేసన్‌కు వెళ్లే అవకాశం ఉంది. కాగా మూడవ రోజు రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. ఈ గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అయితే, గత రెండు రోజుల విచారణలో రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం.