ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్ | TV9 Ravi prakash seeks Anti Petition bail from High court | Sakshi
Sakshi News home page

ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్

Published Thu, Jul 17 2014 2:23 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్ - Sakshi

ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్

హైకోర్టులో టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. కిందికోర్టులో తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రావడంలేదని, అందువల్ల కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు భయంగా ఉందని, ఆ కారణంతోనే నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని ఆ పిటిషన్‌లో వివరించారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement