
రవిప్రకాష్, పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి టీవీ9 ఛానల్ సీఈవో రవిప్రకాష్ అని వెల్లడించిన పవన్.. వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 'రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు. అందుకు కొంత సమయం ఇవ్వు. కొద్దిసేపు వేచి చూడు. రవిప్రకాష్.. నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తానంటూ' పవన్ తన తాజా ట్వీట్లో పోస్ట్ చేశారు.
మరోవైపు తన అభిమానులనుద్దేశించి సందేశం పంపారు పవన్. ఈ వివాదంలో ఆవేశపడొద్దదంటూ అభిమానులకు సూచించారు. అభిమానులందరూ సంయమనంతో ఉండాలని కోరారు. వాళ్లు తప్పు చేసి తనపై కేసులు వేస్తున్నారని.. కానీ తాను ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయపోరాటం చేస్తానని మరోసారి పేర్కొన్నారు. నిన్న మీడియాపై జరిగిన దాడిలో పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని సోషల్ మీడియా ద్వారా వివరించారు.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన అంశం అనూహ్య మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఆపై తానే దూషించమని చెప్పానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరపైకి రావడంతో వివాదం మరింత పెద్దదైంది. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.
Raviprakash ,I will text to you separately .. give me sometime.kindly wait! Apologies for making you wai!🙏😊
— Pawan Kalyan (@PawanKalyan) 21 April 2018
Comments
Please login to add a commentAdd a comment