ఎలన్‌ మస్క్‌: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు! ఇప్పుడేమో ఇలా.. | Elon Musk Retweet About Johnny Depp Amber Heard Goes Viral | Sakshi
Sakshi News home page

Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్‌! ఇప్పుడేమో ఇలా..

Published Sat, May 28 2022 1:41 PM | Last Updated on Sat, May 28 2022 1:46 PM

Elon Musk Retweet About Johnny Depp Amber Heard Goes Viral - Sakshi

ఎలన్‌ మస్క్‌కు ఉన్న ఫాలోయింగ్‌, అభిమాన గణం సంగతి ఏమోగానీ.. తాజాగా ఆయన చేసిన ఓ రీట్వీట్ ఎక్కువ విమర్శలకే దారి తీసింది. హాలీవుడ్‌ సెలబ్రిటీ ఎక్స్‌ కపుల్‌.. జానీ డెప్‌-అంబర్‌ హర్డ్‌ కోర్టుకెక్కిన వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు ఎలన్‌ మస్క్‌. 

డెప్‌-హర్డ్‌ దావా వ్యవహారంలో శుక్రవారం కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో జ్యూరీ తదుపరి చర్చలు మొదలు పెట్టింది. ఈ దరిమిలా.. ఎలన్‌ మస్క్‌ శనివారం ఉదయం ఓ ట్వీట్‌ చేశాడు. ఇద్దరూ ఉత్తమమైన వ్యక్తిత్వాలు ఉన్న అద్భుతమైన వ్యక్తులని.. వారిద్దరూ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు ఓ ట్వీట్‌కు రీట్వీట్‌ చేశాడు. దీంతో కాపురంలో చిచ్చు పెట్టి.. ఇప్పుడు ఓదారుస్తున్నాడంటూ మండిపడుతున్నారు పలువురు.

బుధవారం కోర్టులో వాదనల సందర్భంగా.. డెప్‌ తన మాజీ టాలెంట్‌ మేనేజర్‌ అయిన క్రిస్ట్రియన్‌ కార్నిన్నోకు పంపిన ఓ సందేశం హైలైట్‌ అయ్యింది. అందులో అంబర్‌ హర్డ్‌, ఎలన్‌ మస్క్‌ మధ్య ఎఫైర్‌ గురించి ప్రస్తావన ఉంది. అసభ్యమైన పదజాలంతో అందులో మస్క్‌ను తిట్టాడు డెప్‌. 

ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్‌, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి.  దాదాపుగా ఆ టైంలోనే నటి అంబర్‌ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్‌ చేశాడు ఎలన్‌ మస్క్‌. ఎలన్‌ మస్క్‌ డేటింగ్‌తో ఆ గొడవలు మరింత ముదిరాయన్నది జానీ డెప్‌ ఆరోపణ. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఆమె కోర్టు ఫీజులను ఎలన్‌ మస్కే చెల్లిస్తున్నాడంటూ చెప్తున్నాడు.

ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం సంపాదించుకున్న ఈ మాజీ భార్యాభర్తలు.. ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావాతో వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్‌ కౌంటీ కోర్టుకెక్కడమే కాదు.. యాక్టింగ్‌ ప్రొఫెషన్‌కు భారీగా డ్యామేజ్‌ చేసుకున్నారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement