
పరువు నష్టం దావా వేసిన అమ్మ
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత రిడీఫ్ డాట్కాం పై పరువునష్టం దావా వేశారు. తన ఆరోగ్యం పై తప్పుడు కథనాలను ప్రచురించారని మంగళవారం పంపిన నోటీసులో జయలలిత పేర్కొన్నారు.
జయలలితకు ఏమైందన్న..? అంశం తమిళనాడులో గత కొన్ని రోజులుగా చర్చలో నిలిచిన విషయం తెలిసిందే. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకురావడం ఉత్కంఠకు దారి తీసింది.