కోర్టు బయట మీడియాతో మాట్లాడుతున్న ప్రకాశ్ రాజ్
మైసూరు : మైసూరు–కొడుగు ఎంపీ ప్రతాప్ సింహపై బహుబాషా నటుడు ప్రకాశ్ రాజ్ మంగళవారం కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దావా కేవలం ఒక్క రూపాయి వేయడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ...ఎంపీగా ఉన్న ప్రతాప్ సింహ ఉన్నత స్థానంలో ఉంటూ సోషల్ మీడియాలలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేశారని, ఇలాంటివి పోస్టు చేసి ప్రతాప్ సింహ తన రౌడీయిజాన్ని చూపిస్తున్నారని అన్నారు.
ఇటీవల తను మోదీపై కర్ణాటకకు సంబంధించిన పలు విషయాలు మీడియా ద్వారా ప్రశ్నిస్తే దానికి కౌంటర్‌గా ప్రతాప్ సింహ, తన పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని, తన కుమారుడు చనిపోయినప్పుడు తాను ఒక డ్యాన్సర్‌తో ఉన్నట్లు పోస్టు చేశారని, అలాంటి వ్యక్తి మోదీ గురించి మాట్లాడే అర్హత లేదని ట్వీట్ చేశారని ప్రకాశ్ అన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగిన ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధ కలిగించాయని, ఆయనపై తనకు వ్యక్తిగత కోపం లేదని, సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించడం, అసభ్యంగా వ్యాఖ్యానిండచడం సరికాదని, అందుకే ఆయనకు ఒక్క రూపాయి పరువు నష్టం దావా వేసినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment