'ఆ చానల్పై పరువునష్టం దావా వేస్తా' | ysrcp leader Bontu rajeswara rao to file defamation suit against ABN andhrajyothy chennal | Sakshi
Sakshi News home page

'ఆ చానల్పై పరువునష్టం దావా వేస్తా'

Published Thu, May 29 2014 2:17 PM | Last Updated on Fri, Aug 10 2018 5:09 PM

'ఆ చానల్పై పరువునష్టం దావా వేస్తా' - Sakshi

'ఆ చానల్పై పరువునష్టం దావా వేస్తా'

మలికిపురం : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు, పోలీసుల దాడుల్లో అవి అధికంగా పట్టుపడ్డట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో చేసిన తప్పుడు ప్రచారం నిరూపించకపోతే ఆ చానల్పై పరువు నష్టం దావా వేస్తామని రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో తాను డబ్బుగాని, మద్యంగాని పంపిణీ చేయలేదని ఆయన తెలిపారు. వాటిని ఏ డిపార్ట్మెంటూ పట్టుకోలేదని స్పష్టం చేశారు. రాజోలు, లక్కవరం తదితర గ్రామాల్లో పోలీసుల దాడి నుంచి భారీగా నగదు, మద్యం తప్పించింది తెలుగుదేశం పార్టీవారేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్కు తెలియకపోవటం విచారకరమని బొంతు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిజాయితీగా పని చేశారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నుంచి డబ్బులు తీసుకుని టీడీపీకి ఓట్లు వేశారని ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసి ప్రజలను అవమానపరిచిందన్నారు. ఇలాంటి బ్లాక్మెయిల్ వ్యవహారాలు ఆ చానల్ స్వస్తి చెప్పాలని లేకుండా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement