
సాక్షి, తూర్పు గోదావరి: కరోనా విపత్కర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణలు ఎంతో కష్టపడి పనిచేన్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలకు సాయం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు లేనిపోని ఆరోపణలు చేశారని, అందుకు ఆయనపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా కేసు వేస్తానని ఎంపీ అన్నారు. ఇక ఆధారాలు లేకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మార్గాని భరత్ హెచ్చరించారు.