
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటున్న చంద్రబాబు.. అదే విషయాన్ని మహానాడు బహిరంగ సభలో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్టాడిన ఎంపీ మార్గాని భరత్.. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు చేపట్టిన పర్యటన దండగ అని విమర్శించారు.
‘బషీర్ బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు. 58 లక్షల మందికి రైతులకు రైతు భరోసా ప్రతి సంవత్సరం సీఎం అందిస్తున్నారు. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది . ఓటుకు నోటు లో దొరికి ఎపి కి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు. పుష్కరాల సమయంలో 29మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పటికీ వారిని పరామర్శించలేదు. ఆర్ధిక నేరాలు చేసే వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడు. బ్లూ మీడియా అని చంద్రబాబు మాట్లడటం కరెక్ట్ కాదు. మీడియా ను బానిస బ్రతుకులు బ్రటుకుతున్నరా అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. అని నిలదీశారు ఎంపీ మార్గాని భరత్.
Comments
Please login to add a commentAdd a comment