Anurag Kashyap Scolded Nawazuddin Siddiqui on the First Day of Gangs of Wasseypur - Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: హాలీవుడ్‌ స్టార్‌లా పోజుకొట్టా.. డైరెక్టర్‌ నాపై వీర లెవల్‌లో ఫైర్‌ అయ్యాడు

Published Mon, Jun 26 2023 3:30 PM | Last Updated on Mon, Jun 26 2023 3:49 PM

Anurag Kashyap Scolded Nawazuddin Siddiqui on First day of Gangs of Wasseypur - Sakshi

సినీప్రియులకు ఫేవరెట్‌ హీరోలుంటారు. అలాగే ఆ హీరోలు కూడా కొంతమంది స్టార్స్‌ను ఇష్టపడతారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖికి కూడా హాలీవుడ్‌ స్టార్స్‌ రాబర్ట్‌ డి నిరో, అల్‌ పాసినో అంటే ఎంతో ఇష్టం. వారిని చూసి ఇన్‌స్పైర్‌ అయిన అతడు అచ్చం వారిలాగే ఉండేందుకు ప్రయత్నించాడట. నడక, మాటతీరు ఆఖరికి నిద్రించే భంగిమలో కూడా సదరు స్టార్స్‌నే అనుకరించాడట! అయితే దీనివల్ల ఓసారి డైరెక్టర్‌తో నానామాటలు పడ్డాడంటున్నాడు నవాజుద్దీన్‌ సిద్దిఖి.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హాలీవుడ్‌ హీరోలను అనుకరిస్తుంటే మా టీచర్‌ వద్దని వారించింది. అయినా నేను పట్టించుకోలేదు. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ సినిమా మొదటి రోజు షూట్‌లో నేను అల్‌ పాసినోలా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లాను. అతడిలాగే మాట్లాడాను. డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌కు నా తీరు ఏమాత్రం నచ్చలేదు. పొద్దునంతా ఓపిక పట్టిన ఆయన రాత్రి నన్ను చెడామడా తిట్టాడు. నువ్వు అల్‌ పాసినోలా ప్రవర్తిస్తూ చాలా టూమచ్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నావు అని ఫైర్‌ అయ్యాడు.

నాకు తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అవమానంతో రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టలేదు. తెల్లారి సెట్స్‌కు నేను పూర్తిగా నవాజ్‌లాగే వెళ్లాను' అని చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్‌ సిద్దిఖి. ఇతడు చివరిసారిగా టికు వెడ్స్‌ షెరు చిత్రంలో నటించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం అతడు జోగిరా సారా రారా, అఫ్‌వాహ్‌ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: చవక రేటుకే ఆదిపురుష్‌ 3D టికెట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement