నన్ను చూసి చాలామంది పేదవాడిని అనుకుంటారు, కానీ అది నిజం కాదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. తన కుటుంబం దగ్గర బతకడానికి సరిపోయేంత డబ్బు ఉందని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దిఖి మాట్లాడుతూ.. 'నేను పేద కుటుంబం నుంచి రాలేదు.
నా తల్లిదండ్రులు మరీ అంత ధనవంతులు కాకపోయినా జీవించేందుకు సరిపోయేంత డబ్బు ఉండేది. అయితే నటుడిగా కెరీర్ ఆరంభించడానికి ముందు ఇక్కడ వాచ్‌మెన్‌గా పని చేశాను. పేరెంట్స్ దగ్గర డబ్బు ఆశించకూడదనే ఆ ఉద్యోగం చేశాను. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు.. మనీ పంపిస్తాం. నువ్వు ఏదీ చెప్పకపోతే అసలు ఏం చేస్తున్నావో మాకెలా తెలుస్తుంది? అని పేరెంట్స్ అంటూ ఉండేవారు.
సినిమాలో ఛాన్స్ వచ్చేంతవరకు వారికేదీ చెప్పకూడదనుకున్నాను. అలా మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేశాను. చిన్న సినిమాల్లోనూ యాక్ట్ చేశాను' అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో నిన్నటి (జూన్ 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment