పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు Nawazuddin Siddiqui Advice on Marriage After Reuniting with Wife Aaliyah | Sakshi
Sakshi News home page

ఈ మధ్యే భార్యతో కలిసిపోయిన నటుడు.. పెళ్లి దండగ అంటూ కామెంట్స్‌..

Published Thu, Jun 27 2024 1:50 PM | Last Updated on Thu, Jun 27 2024 3:00 PM

Nawazuddin Siddiqui Advice on Marriage After Reuniting with Wife Aaliyah

ఆలూమగల మధ్య కొట్లాటలు సహజమే.. కానీ కొన్ని జంటల మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు తారాస్థాయిలో ఉంటాయి. కొందరైతే ఇదంతా భరించలేక విడాకులు తీసుకుంటారు. బాలీవుడ్‌ జంట నవాజుద్దీన్‌ సిద్దిఖి- ఆలియా కూడా అదే పని చేద్దామనుకున్నారు. అత్తింట్లోకి రానివ్వడం లేదని, తనను వేధిస్తున్నారంటూ ఆలియా రోడ్డుపై నానా రచ్చ చేసింది. కట్‌ చేస్తే.. కూతురి క్షేమం కోసం దంపతులిద్దరూ విడాకుల ఆలోచన విరమించుకుని కలిసిపోయారు.

పెళ్లెందుకు దండ
తాజాగా నవాజుద్దీన్‌ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి చేసుకోవడం దండగ అని మాట్లాడాడు. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లెందుకు అని ప్రశ్నించాడు. 'మీరు నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వివాహం చేసుకోకుండా కూడా ఆ ప్రేమను కొనసాగించవచ్చు కదా! మ్యారేజ్‌ వల్ల ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చూపిస్తారు. 

భార్య వల్ల సంతోషం..
అదే ఈ పెళ్లి గోల లేకపోతే ఇద్దరూ అలాగే ప్రేమగా, ఆప్యాయంగా గడిపేయొచ్చు. అలా కాదని వైవాహిక బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా రానురానూ కరిగిపోతూ ఉంటుంది. భార్య మనకు సంతోషాన్నిస్తుందని మొదట్లో అనుకుంటాం. కానీ రానురానూ మన ఉద్యోగం, చేసే పని వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆలియా, నవాజుద్దీన్‌ సిద్దిఖి ఇటీవలే 14వ పెళ్లి రోజు జరుపుకున్నారు.

చదవండి: 'కల్కి' గెస్ట్‌ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement