
ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవిత కథ ఆధారంగా వచ్చిన చిత్రం "మాంటో". బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. నటి, దర్శకురాలు నందితా దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషి కపూర్, రన్‌వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావల్, దివ్యా దత్త కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరందరూ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటించారట. ఈ విషయాన్ని గతంలో నందితా దాస్ స్వయంగా మీడియాకు వెల్లడించింది.
డబ్బుకు కాకుండా స్క్రిప్ట్‌కు విలువిచ్చి వారంతా పైసా తీసుకోలేదని పేర్కొంది. మరి ఈ సినిమాలో హీరోగా నటించిన నవాజుద్దీన్ ఎంత తీసుకున్నారనుకుంటున్నారు? అక్షరాలా ఒక్క రూపాయి. అవును, ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. "మాంటో సినిమా ద్వారా నా ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్న నేను నందిత దగ్గర నుంచి డబ్బులు ఆశించానంటే అంతకన్నా అపరాధం మరొకటి ఉండదు. కానీ ప్రొఫెషనల్ నటుడిగా ఒక్క రూపాయి మాత్రం తీసుకున్నాను" అని నవాజుద్దీన్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment