
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తన పిల్లలను తనక్కాకుండా చేయాలని కుట్రచేస్తున్నారంటూ బోరున విలపించింది. ఈ వీడియోను ఆలియా శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 'నా పిల్లలకు అతడు ఎప్పటికీ తండ్రి కాలేడు. వాళ్లు ఎలా ఉన్నారని ఏరోజూ పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడేదో మంచి తండ్రి అని నిరూపించుకునేందుకు నా పిల్లలను లాక్కోవాలని చూస్తున్నాడు. ఈ పిరికివాడు తన అధికారం చెలాయించి తల్లి నుంచి పిల్లలను వేరు చేయాలని చూస్తున్నాడు. డబ్బుతో మనుషులను కొనుక్కోగలవేమో కానీ నా పిల్లల్ని లాక్కోలేవు. అసలు వారిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు? నీతో ఉంటారనుకుంటున్నావా? తండ్రి అంటే ఏంటో కూడా వారికి తెలియదు' అని ఏడ్చేసింది.
'నా పిల్లలను అక్రమం సంతానం అని నీ తల్లి నానా మాటలు అన్నప్పుడు నోరెత్తకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు. ఇప్పుడేమో గొప్ప మనిషివని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు... మహానటుడివి. సాక్ష్యాలతో సహా నాపై అత్యాచారం చేశావని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఏం జరిగినా సరే మనసు లేని కర్కోటకుల చేతిలోకి నా పిల్లలను చేరనివ్వను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. కాగా తనకు సరైన తిండి పెట్టడం లేదని, కనీసం బాత్రూమ్ కూడా వినియోగించుకోవడం లేదని ఇదివరకే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై అటు ఆలియా, ఇటు నవాజుద్దీన్ కుటుంబం కోర్టు మెట్లెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment