Aaliya
-
నా కూతురు తట్టుకోలేదు, అందుకే ఈ నిర్ణయం: నటుడి భార్య
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, తన పిల్లల్ని నడిరోడ్డున పడేశాడంటూ విడాకులకు దరఖాస్తు చేసింది. అటు నవాజుద్దీన్ కూడా.. ఆమె తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని కోర్టుకెక్కాడు. కోర్టు విడాకులు మంజూరు చేయకపోయినా ఇద్దరూ నానా రచ్చ చేసి విడిపోయినంత పని చేశారు. ఆ మధ్య ఆలియా.. 'ఒక బంధం నుంచి బయటపడేందుకు 19 ఏళ్లు పట్టింది. స్నేహం కన్నా ముఖ్యమైన బంధంలో ఉన్నాను' అంటూ పోస్ట్ పెట్టడంతో తను మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వైరలయ్యాయి. మంచి కూడా చెప్పుకోవాలి కట్ చేస్తే బద్ధ శత్రువుల్లా విరోధం పెంచుకున్న నవాజుద్దీన్ సిద్దిఖి, ఆలియా కలిసిపోయారు. ఈ విషయాన్ని ఆలియా వెల్లడించింది. మా వైవాహిక బంధానికి 14 ఏళ్లు నిండాయంటూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ మధ్య నా జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. మనకు జరిగిన చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నప్పుడు మంచి జరిగినప్పుడు కూడా చెప్పుకోవాలి. పిల్లలతో కలిసి నవాజుద్దీన్, నేను.. మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లల కోసం ఆలోచించి.. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరడంతో అన్ని గొడవలు జరిగాయి. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు అన్నీ తొలగిపోయాయి. పిల్లల కోసం మేము కలిసుండాలనే నిర్ణయించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు మేము విడిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నవాజ్.. షోరా(కూతురు)తో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. మా మధ్య ఏం జరిగినా అది పిల్లల్ని మానసికంగా దెబ్బ తీస్తుంది. షోర అస్సలు తట్టుకోలేదు. అందుకే ఇకమీదట మేము పోట్లాడకూడదని, ప్రశాంతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం కలిసిపోవాలనుకున్నందుకు నెటిజన్లు ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Anand pandey (@aaliya_anand_pandey_) చదవండి: ట్రోలింగ్‌కు బాధపడుతున్న అనుపమ.. అందుకే డుమ్మా! -
నటుడితో విభేదాలు.. మరొకరితో లవ్‌లో పడ్డ నవాజుద్దీన్ భార్య!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి- ఆలియాలు ఏదో ఒక వివాదంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే! తనను, తన పిల్లలను రోడ్డున వదిలేశాడని ఆలియా, ఆమె తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ నవాజుద్దీన్ కోర్టు మెట్లెక్కారు. వీరిద్దరూ విడిపోయారే కానీ ఇంతవరకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. అయితే ఆలియా అప్పుడే తన జీవితంలో మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. తన లైఫ్‌లోకి ఓ ముఖ్యమైన వ్యక్తిని స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఒక బంధం నుంచి బయటపడటానికి 19 ఏళ్లు పట్టింది. కానీ నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. నేనిచ్చే ప్రాధాన్యతలో ఎటువంటి మార్పు లేదు. కానీ కొన్ని బంధాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు చాలా సంతోషంగానూ ఉంది. ఈ హ్యాపీనెస్‌ను మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు ఆనందంగా ఉండే హక్కు లేదంటారా? చెప్పండి..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు 'ఇప్పటికైనా సంతోషంగా ఉన్నావు, అది చాలు', 'ఇక మీదట నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: గ్రాండ్‌గా సీనియర్ నటి సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్ -
నా భర్త నాపై అత్యాచారం చేశాడు, సాక్ష్యం ఉంది: నటుడి భార్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తన పిల్లలను తనక్కాకుండా చేయాలని కుట్రచేస్తున్నారంటూ బోరున విలపించింది. ఈ వీడియోను ఆలియా శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 'నా పిల్లలకు అతడు ఎప్పటికీ తండ్రి కాలేడు. వాళ్లు ఎలా ఉన్నారని ఏరోజూ పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడేదో మంచి తండ్రి అని నిరూపించుకునేందుకు నా పిల్లలను లాక్కోవాలని చూస్తున్నాడు. ఈ పిరికివాడు తన అధికారం చెలాయించి తల్లి నుంచి పిల్లలను వేరు చేయాలని చూస్తున్నాడు. డబ్బుతో మనుషులను కొనుక్కోగలవేమో కానీ నా పిల్లల్ని లాక్కోలేవు. అసలు వారిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు? నీతో ఉంటారనుకుంటున్నావా? తండ్రి అంటే ఏంటో కూడా వారికి తెలియదు' అని ఏడ్చేసింది. 'నా పిల్లలను అక్రమం సంతానం అని నీ తల్లి నానా మాటలు అన్నప్పుడు నోరెత్తకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు. ఇప్పుడేమో గొప్ప మనిషివని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు... మహానటుడివి. సాక్ష్యాలతో సహా నాపై అత్యాచారం చేశావని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. ఏం జరిగినా సరే మనసు లేని కర్కోటకుల చేతిలోకి నా పిల్లలను చేరనివ్వను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. కాగా తనకు సరైన తిండి పెట్టడం లేదని, కనీసం బాత్రూమ్ కూడా వినియోగించుకోవడం లేదని ఇదివరకే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై అటు ఆలియా, ఇటు నవాజుద్దీన్ కుటుంబం కోర్టు మెట్లెక్కారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: హైదరాబాద్‌లో చెప్పులు లేకుండా.. అమెరికాలో షూలతో -
అతను పట్టించుకోలేదు.. డెలీవరీ ఖర్చుల కోసం ప్లాట్ అమ్మేశా: ప్రముఖ నటుడి భార్య
బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి-ఆలియాల మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా.. మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై విరుచుపడింది. అతను మంచి వాడు కాదని, మానసికంగా తనను వేధింపులకు గురి చేశాడని గతంలో చెప్పింది. తాజాగా ఆలియా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో నవాజుద్దీన్‌కు, ఆమెకు మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. *నేనంటే విలువలేని ఓ మనిషి కోసం నా జీవితంలో 18 ఏళ్లు కేటాయించినందుకు చింతిస్తున్నాను. 2004లో మొదటిసారి సిద్ధిఖీ కలిశాను. అప్పట్లో నేనూ, నవాజ్, ఆయన సోదరుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. కొంతకాలానికి నేను, నవాజుద్దీన్ చాలా దగ్గరయ్యాం. తను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని నమ్మాను. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో నవాజ్‌కు సంపాదన లేదు. దాంతో నేనూ, ఆయన సోదరుడు కలిసే ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చాను. డెలీవరీ ఖర్చుల కోసం మా అమ్మ ఇచ్చిన ప్లాట్ అమ్మాను. అతనికి ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. మానవత్వం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతడేమీ మంచి వాడు కాదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం చేశాడు. అతని మాటలు మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి’ అని ఆలియా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)