నా కూతురు తట్టుకోలేదు, అందుకే ఈ నిర్ణయం: నటుడి భార్య | Nawazuddin Siddiqui Wife Aaliya On Reconciliatio, Says They Surrendered For Their Children - Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్‌ లేదంటూ..

Published Thu, Mar 28 2024 10:00 AM | Last Updated on Thu, Mar 28 2024 11:15 AM

Nawazuddin Siddiqui wife Aaliya Says They Surrendered For Their Children - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, తన పిల్లల్ని నడిరోడ్డున పడేశాడంటూ విడాకులకు దరఖాస్తు చేసింది. అటు నవాజుద్దీన్‌ కూడా.. ఆమె తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని కోర్టుకెక్కాడు. కోర్టు విడాకులు మంజూరు చేయకపోయినా ఇద్దరూ నానా రచ్చ చేసి విడిపోయినంత పని చేశారు. ఆ మధ్య ఆలియా.. 'ఒక బంధం నుంచి బయటపడేందుకు 19 ఏళ్లు పట్టింది. స్నేహం కన్నా ముఖ్యమైన బంధంలో ఉన్నాను' అంటూ పోస్ట్‌ పెట్టడంతో తను మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వైరలయ్యాయి.

మంచి కూడా చెప్పుకోవాలి
కట్‌ చేస్తే బద్ధ శత్రువుల్లా విరోధం పెంచుకున్న నవాజుద్దీన్‌ సిద్దిఖి, ఆలియా కలిసిపోయారు. ఈ విషయాన్ని ఆలియా వెల్లడించింది. మా వైవాహిక బంధానికి 14 ఏళ్లు నిండాయంటూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ మధ్య నా జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. మనకు జరిగిన చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నప్పుడు మంచి జరిగినప్పుడు కూడా చెప్పుకోవాలి. పిల్లలతో కలిసి నవాజుద్దీన్‌, నేను.. మా యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకున్నాం.

పిల్లల కోసం ఆలోచించి..
మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరడంతో అన్ని గొడవలు జరిగాయి. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు అన్నీ తొలగిపోయాయి. పిల్లల కోసం మేము కలిసుండాలనే నిర్ణయించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు మేము విడిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నవాజ్‌.. షోరా(కూతురు)తో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. మా మధ్య ఏం జరిగినా అది పిల్లల్ని మానసికంగా దెబ్బ తీస్తుంది. షోర అస్సలు తట్టుకోలేదు. అందుకే ఇకమీదట మేము పోట్లాడకూడదని, ప్రశాంతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం కలిసిపోవాలనుకున్నందుకు నెటిజన్లు ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు.

చదవండి: ట్రోలింగ్‌కు బాధపడుతున్న అనుపమ.. అందుకే డుమ్మా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement