Nawazuddin Siddiqui Wife Aaliya Write Long Note on His Husband - Sakshi
Sakshi News home page

అతను పిల్లల్ని పట్టించుకోడు.. డెలీవరీ ఖర్చుల కోసం ప్లాట్‌ అమ్మేశా: ప్రముఖ నటుడి భార్య

Published Sat, Feb 11 2023 2:31 PM | Last Updated on Sat, Feb 11 2023 3:00 PM

Nawazuddin Siddiqui Wife Aaliya Write Long Note On His Husband - Sakshi

బాలీవుడ్‌ జంట నవాజుద్దీన్‌ సిద్దిఖి-ఆలియాల మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా..  మీడియా వేదికగా  నవాజుద్దీన్‌పై విరుచుపడింది. అతను మంచి వాడు కాదని, మానసికంగా తనను వేధింపులకు గురి చేశాడని గతంలో చెప్పింది. తాజాగా ఆలియా ఓ వీడియోని షేర్‌ చేసింది. అందులో నవాజుద్దీన్‌కు, ఆమెకు మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

*నేనంటే విలువలేని ఓ మనిషి కోసం నా జీవితంలో 18 ఏళ్లు కేటాయించినందుకు చింతిస్తున్నాను. 2004లో మొదటిసారి సిద్ధిఖీ కలిశాను. అప్పట్లో నేనూ, నవాజ్‌, ఆయన సోదరుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. కొంతకాలానికి నేను, నవాజుద్దీన్‌ చాలా దగ్గరయ్యాం. తను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని నమ్మాను. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో నవాజ్‌కు సంపాదన లేదు. దాంతో నేనూ, ఆయన సోదరుడు కలిసే ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చాను. డెలీవరీ ఖర్చుల కోసం మా అమ్మ ఇచ్చిన ప్లాట్‌ అమ్మాను. అతనికి ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. 

మానవత్వం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతడేమీ మంచి వాడు కాదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం చేశాడు. అతని మాటలు మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి’ అని ఆలియా రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement