alia
-
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్‌గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్‌కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్‌కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్‌గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్‌కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్‌లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్‌ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్‌ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్‌గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్‌గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్‌లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్‌కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్‌గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్‌ఫుల్‌గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్‌ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్‌కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది.ఫ్యాషన్‌లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్‌వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్‌తో మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్‌కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్‌ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్‌ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
ఇక విడాకులే ఫైనల్.. ఇప్పటికే ప్రక్రియ మొదలైంది: ఆలియా
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య ఆలియాతో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దుబాయ్ నుంచి పిల్లలతో సహా ఇండియాకు తిరిగొచ్చిన ఆలియా.. నవాజుద్దీన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్యపై బాంబే హైకోర్టులో రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆలియా విడాకుల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఆలియా మాట్లాడుతూ.. 'విడాకుల ప్రక్రియ కచ్చితంగా జరుగుతుంది. నా పిల్లల సంరక్షణ కోసం నేను పోరాడతా. నా పిల్లలిద్దరూ నాతో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడరు' అని అన్నారు. ఇదే విషయంపై ఆలియా తరఫున లాయర్ రిజ్వాన్ ఇప్పటికే కోర్టుకు వాంగ్మూలం సమర్పించినట్లు తెలిపారు. నవాజుద్దీన్ న్యాయవాదులు తనకు సెటిల్మెంట్ కోసం కొన్ని నిబంధనలు పంపారని తెలిపారు. ఇప్పుడు ఆలియాతో అదే విషయమై చర్చిస్తున్నట్లు రిజ్వాన్ సిద్ధికీ పేర్కొన్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం వివాదం ముగిసిపోయేలా ప్రయత్నిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రూ. 100 కోట్ల పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని సిద్దిఖీని కోరతామని రిజ్వాన్ పేర్కొన్నారు. అయితే మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు కాపీని మాకు ఇంకా అందజేయలేదని అన్నారు. -
భార్య, పిల్లలను ఇంట్లో నుంచి గెంటేసిన స్టార్ హీరో
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్ నటుడిపై అతని భార్య ఆలియా సంచలన కామెంట్స్ చేశారు. తనను , పిల్లలను ఇంటినుంచి గెంటేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కాగా.. ఇటీవల నవాజుద్దీన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ముంబైలోని వెర్సోవాలోని తన బంగ్లాకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఇంట్లోకి రాకుండా సోదరుడు ఫైజుద్దీన్ అడ్డుకున్నాడని నవాజుద్దీన్ ఆరోపించారు. తాజాగా అతని భార్య ఆలియా బంగ్లా బయట నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. అక్కడ ఆమె కుమార్తె షోరాను లోపలికి అనుమతించలేదని ఆ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. నవాజుద్దీన్ భార్య ఆలియా మాట్లాడుతూ..' తన పిల్లలను కూడా విడిచిపెట్టని నవాజుద్దీన్ సిద్ధిఖీ నైజం ఇదే. 40 రోజుల పాటు ఇంట్లో ఉన్న నేను వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కానీ నేను తిరిగి వచ్చాక నవాజుద్దీన్ సిద్ధిఖీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా చాలా మంది కాపలాదారులను నియమించాడు.. నన్ను, నా పిల్లలను నడిరోడ్డుపై వదిలేశాడు.. తన సొంత తండ్రి తనతో ఇలా చేస్తాడని నా కుమార్తె నమ్మలేకపోయింది. రోడ్డుపై ఏడుస్తున్న మమ్మల్ని నా బంధువుల్లో ఒకరు ఇంటికి తీసుకువెళ్లారు. నా పిల్లలను ఇంట్లో నుంచి తరిమి రోడ్లపై నిలబెట్టిన వ్యక్తి నవాజుద్దీన్ సిద్ధిఖీ. అతని అసలు రూపం ఇదే. నవాజుద్దీన్ మీరు నన్ను మా నా పిల్లలను విచ్ఛిన్నం చేయలేరు. నేను న్యాయం జరిగే పోరాడుతూనే ఉంటానంటూ వీడియోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) -
అతను పట్టించుకోలేదు.. డెలీవరీ ఖర్చుల కోసం ప్లాట్ అమ్మేశా: ప్రముఖ నటుడి భార్య
బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి-ఆలియాల మధ్య విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా.. మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై విరుచుపడింది. అతను మంచి వాడు కాదని, మానసికంగా తనను వేధింపులకు గురి చేశాడని గతంలో చెప్పింది. తాజాగా ఆలియా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో నవాజుద్దీన్‌కు, ఆమెకు మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. *నేనంటే విలువలేని ఓ మనిషి కోసం నా జీవితంలో 18 ఏళ్లు కేటాయించినందుకు చింతిస్తున్నాను. 2004లో మొదటిసారి సిద్ధిఖీ కలిశాను. అప్పట్లో నేనూ, నవాజ్, ఆయన సోదరుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. కొంతకాలానికి నేను, నవాజుద్దీన్ చాలా దగ్గరయ్యాం. తను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని నమ్మాను. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో నవాజ్‌కు సంపాదన లేదు. దాంతో నేనూ, ఆయన సోదరుడు కలిసే ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చాను. డెలీవరీ ఖర్చుల కోసం మా అమ్మ ఇచ్చిన ప్లాట్ అమ్మాను. అతనికి ఓ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. మానవత్వం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతడేమీ మంచి వాడు కాదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం చేశాడు. అతని మాటలు మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి’ అని ఆలియా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) -
కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్‌పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్‌తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్‌ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
Alia Farooq: 4 నెలల్లో 28 కేజీల బరువు తగ్గి.. ఇప్పుడు...
అనేక రంగాల్లో మహిళలు రాణిస్తూ మగవారితో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కానీ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతాల్లోని మహిళలు అనేక కట్టుబాట్లు, నిబంధనల మధ్య నిర్భయంగా ఇంటి నుంచి బయటకు రావడమే కష్టం. అటువంటిది ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో ఎప్పుడూ ఉగ్రమూకల దాడులతో దద్దరిల్లుతూ అశాంతిగా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో.. అక్కడి పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే కశ్మీర్‌కు చెందిన ఆలియా ఫారుఖ్ ఎనిమిదేళ్ల కిందటే మూసపద్ధతులకు విభిన్నంగా ఆలోచించి, ఫిట్నెస్ను సరికొత్త కెరియర్‌గా మార్చుకుని మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణిస్తోంది. శ్రీనగర్‌లోని ఖన్యార్కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లలకు తల్లి. పిల్లలు పుట్టిన తరువాత హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడంతో ఒక్కసారిగా అధికంగా బరువు పెరిగి, తన పనులు తానే సరిగా చేసుకోలేక నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. సరిగ్గా అప్పుడే వెకేషన్లో భాగంగా ఆలియా కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆలియా తల్లి ఆమెను డాక్టర్‌కు చూపించి ఆమె బరువు పెరగడం, నిరాశకు లోనవడం వంటి సమస్యల గురించి డాక్టర్‌కు చెప్పింది. Photo: Facebook డాక్టర్ జిమ్‌లో చేరి బరువు తగ్గమని సూచించడంతోపాటు ఢిల్లీలో.. పెళ్లి అయ్యి, పిల్లలున్న మహిళలు తమ శరీరాన్ని ఎంత ఫిట్‌గా ఉంచుకుంటున్నారో చూపిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో ఆలియా ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో జిమ్‌లో చేరింది. కానీ మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి శారీరక తత్వం గురించి పురుష ట్రైనర్లకు పెద్దగా అర్థం కాదు అనుకునేది. అలా అనుమానం ఉన్నప్పటికీ, ఎలాగైనా బరువు తగ్గాలన్న దృఢనిశ్చయంతో.. జిమ్‌లో చేరిన కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 28 కేజీల బరువు తగ్గింది. ఫిట్నెస్ సొల్యూషన్ ఆలియా భర్త 2010లో ఖన్యార్‌లో ‘ఫిట్నెస్ సొల్యూషన్ జిమ్’ పేరిట జిమ్‌ను ప్రారంభించాడు. కానీ దానిని సరిగా నిర్వహించలేకపోవడం చూసిన ఆలియా అతని జిమ్‌ను తీసుకుని తనే ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఉన్న బాడీ బిల్డింగ్ అసోసియేషన్‌లో చేరి ఫిట్‌నెస్‌లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని 2012లో జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. శ్రీనగర్‌లో మహిళా ట్రైనర్ నిర్వహిస్తోన్న తొలి జిమ్ కావడంతో అమ్మాయిలంతా తన జిమ్‌లో చేరడానికి ఆసక్తి కనబరిచారు. Photo: Facebook దీంతో ఈ తొమ్మిదేళ్లలో ఆలియా కశ్మీర్ లోయలోని 20 వేల మందికిపైగా అమ్మాయిలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చింది. ప్రారంభంలో మహిళ జిమ్ నడపడం ఏమిటీ? అని అనేక విమర్శలు, ఈమె ఏమాత్రం నడుపుతుందో చూద్దాం వంటి సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. వాటిని సీరియస్‌గా తీసుకోని ఆలియా తన భర్త, అత్తమామల ప్రోత్సాహంతో జిమ్‌ను ధైర్యంగా నిర్వహించేది. దీంతో కశ్మీర్లో తొలి మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా ఆలియాకు గుర్తింపు రావడమేగాక, అనేక అవార్డులు వరించాయి. అంతేగాక జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యింది. జిల్లాకో సెంటర్ ‘మహిళలకు ఉమన్ ఫిట్నెస్ ట్రైనర్ అవసరం చాలా ఉంది. అది నేను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యాను. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా జిమ్‌ను నిర్వహిస్తున్నాను. హైబీపీ, కొలె్రస్టాల్ స్థాయులు, సంతానలేమితో బాధపడుతోన్న మహిళలకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యలున్న మహిళలంతా జిమ్‌లో చేరి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా జిమ్‌కు స్పందన బావుండడంతో ప్రభుత్వాన్ని సంప్రదించి జిల్లాకో ‘మహిళా ఫిట్నెస్ సెంటర్’ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ఆలియా చెప్పింది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
ఆలియా @ కియారా
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక హీరోయిన్స్ కొన్నిసార్లు స్క్రీన్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పేరు కంటే వేరే పేరు బావుంటుందని దర్శక–నిర్మాతలు సూచించడమో, లేదా అదే పేరుతో వేరే వాళ్లు ఉన్నప్పుడో స్క్రీన్ నేమ్ పెట్టుకుంటుంటారు. కియార అద్వానీ అసలు పేరు కియార కాదట. స్క్రీన్ కోసం నేమ్ చేంజ్ చేసుకున్నారట. ‘నా అసలు పేరు ఆలియా. ఆల్రెడీ ఆలియా భట్ ఉంది కాబట్టి పేరు మార్చుకోమని సల్మాన్ సూచించారు’ అన్నారు కియారా అద్వానీ. ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్’తో సౌత్‌లోనూ పాపులర్ అయ్యారు. తన పేరు బాలీవుడ్ బారసాల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘స్క్రీన్ నేమ్ మార్చుకోవాలని సల్మాన్ చెప్పారు. కియారా అనే పేరుని నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంట్లో కూడా కియారా అనే పిలుస్తున్నారు’’ అన్నారు. -
ఆలియా
‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి.‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. పైనెక్కడో స్వర్గం ఉంటే ఉండనివ్వండి. ఎవరిక్కావాలది భూమ్మీద మనకో ఇల్లుంటే! సొంతఇల్లేం కాదు. సొంత మనుషులతో ఉన్న ఇల్లు. అది చాలు. దేవుణ్ణే దిగిరమ్మని పిలిచి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దేవుణ్ణి ఇల్లంతా తిప్పి చూపించవచ్చు. ‘దేవుడా ఇది హాలు. అది కిచెన్. ఇదిగో నీ గది. అందులో నీ పటం. తినని రోజు ఉంటుందేమో. నీ పటం ముందు నిలబడని రోజు ఉండదు మాకు’ అని ఆయనక్కూడా కాస్త కుంకుమ అద్దొచ్చు. దేవుణ్ణి కాసేపలా మొక్కల మధ్యలోకి తీసుకెళ్లొచ్చు. దేవుడు ఊరికే చూస్తుంటాడు. అతిథి కదా. అది మన ఇల్లు కదా! ఆలియాకు కూడా ఇలాంటి ఇల్లే ఉండేది. ఆలియా ఏడేళ్ల పిల్ల. అలెప్పోలో వాళ్ల ఇల్లు. సిరియా! ఆ ప్రాంతంలోనే కొంత దూరంలో నానమ్మ, తాతయ్యల ఇల్లు. రెండు స్వర్గాలు ఆలియాకు. ఓ రోజు ఆలియాను చంకనేసుకుంది తల్లి. ‘ఎక్కడికమ్మా!’.. అడిగింది ఆలియా. ‘ఇల్లొదిలి వెళ్లిపోతున్నాం’ అంది. ఇల్లొదిలి వెళ్లిపోతున్నామనే చెప్పింది. ఊరొదిలీ, దేశం వదిలీ వెళ్లిపోతున్నాం అని చెప్పలేదు. ముందు నానమ్మ వాళ్లింట్లో వదిలిపెట్టింది. అక్కడ మళ్లీ తాతయ్య ఆలియాను చంకనేసుకున్నాడు. తాతయ్య కూడా అమ్మ చెప్పినట్లే చెప్పాడు. ‘మనం ఇల్లొది వెళ్లిపోతున్నాం’ అని! రెండిళ్లూ పోయాయి. పోయిన స్వర్గాల గురించి ఆలోచించే వయసా అది. వెళ్లిన చోట ఇంకో స్వర్గం. అంతే కదా పిల్లలు. కొత్త ప్రదేశాల కన్నా కూడా కొత్త ప్రదేశాలకు కదలడాన్ని ఇష్టపడతారు. తాతయ్య భుజం ఎక్కి కూర్చుంది ఆలియా. కుటుంబం అంతా నడుస్తోంది. నడుస్తోంది. నడుస్తోంది. దారి పొడవునా తాతయ్య కాళ్లకు మనుషులు తగులుతున్నారు. మనుషులు కాదు. తునాతునకలైన మనుషులు. కాళ్లూ చేతులు లేనివి కొన్ని. తలలూ మొండేలు లేనివి కొన్ని. మనవరాలికి నేల కనిపించకుండా ఆకాశాన్ని చూపిస్తున్నాడు తాతయ్య. ఎంతసేపని ఆకాశంలోకే చూస్తుంది. ఆమె చూపు నేలను తాకింది. పెద్దగా ఏడుపందుకుంది ఆలియా. ‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి. ‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. ఇప్పుడు లెబనాన్‌లోని దేమర్లో ఉంటోంది ఆలియా, తాతయ్య.. ఇంకా అమ్మ, నాన్న. అలెప్పోలో తన స్నేహితురాలిని వదిలొచ్చి సరిగ్గా ఏడాది అవుతోంది ఆలియా. ఆ స్నేహితురాలి పేరు రవుయా. తనను మర్చిపోలేకపోతోంది. కలిసి ఆడుకునేవారు. కలిసి స్కూలుకు వెళ్లేవారు. కొన్ని పావురాలు ఉండేవి. వాటిల్లో కొన్ని గుడ్లు కూడా పెట్టాయి. ఆ పావురాలకు ఆలియా గింజలు వేసేది. ఇప్పుడు వాటన్నిటినీ తలుచుకుని బెంగపడుతోంది. వాటి గురించి దేవుణ్ణి ప్రార్థిస్తోంది. వాటి గురించే కాదు, ఆ రోజు తాతయ్య భుజం మీద నుంచి చూసిన మృతదేహాల గురించి కూడా! ఇప్పుడు తెలుస్తోంది ఆలియాకు అలñ ప్పోలో తనకు రెండు స్వర్గాలు ఉండేవని. శరణార్థులకు అందే సహాయం ఆలియా కుటుంబానికి కూడా అందుతోంది. మంచి తిండి ఉంది. మంచి బట్టలు ఉన్నాయి. మంచి స్వర్గమే లేదు. ఆలియా ఓ పిల్లి పిల్లను పెంచుకుంటోంది. అదెప్పుడూ ఆలియా ఒంటి మీదే ఉంటుంది. ఆ పిల్లితో ఆలియా ఎప్పుడూ అంటుండే మాట.. ‘అలా మ్యామ్ మ్యావ్ మంటూ అరవకు. త్వరలోనే మన ఇంటికి మనం వెళ్లిపోతాం’ అని! ఈ రోజు ‘ప్రపంచ శరణార్థుల దినం’. ప్రపంచం మొత్తం మీద రెండు కోట్ల ఇరవై లక్షల మంది శరణార్థులు ఉన్నారు. ఆలియాకు ఉన్నట్లే.. రెండు కోట్ల ఇరవై లక్షల కథలున్నాయి. – మాధవ్ శింగరాజు -
'ప్లీజ్.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'
సాక్షి, మీరట్ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్ అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత శ్లోకాలు చెప్పడం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను కృష్ణుడు వేషం వేసి, భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన ఇస్లాం బలహీనమైనదని అర్ధం కాదు. అలా అనుకునే వారితో నేను ఏకీభవించను. ముస్లిం మత పెద్దలు నాకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశారు. అందుకే ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు' అని అలియా వేడుకుంది. గతంలో కూడా తాను చేసిన పని ఏ ఒక్క మత విశ్వాసాన్నిగానీ, గుర్తింపునకుగానీ హానీ కలిగించదని చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది (2017) డిసెంబర్ 30న జరిగిన ఓ కార్యక్రమంలో అలియా కృష్ణుడి వేషం వేసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు కూడా చదివింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. -
అలియా, అనుష్కలు స్పందించారు!
ఇటీవల బహుళ అంతస్తుల భవనంపైనుంచి కుక్కను కిందికి విసిరిన వైద్య విద్యార్థుల దుశ్చర్యపై నటీమణులు అలియా భట్, అనుష్కా శర్మలు స్పందించారు. వైద్య విద్యార్థులయ్యుండి అటువంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. సమాజానికి నష్టాన్ని కలిగించే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. కుక్కను భవనంపైనుంచీ అమానుషంగా విసిరేయడమే కాక ఆ దృశ్యాలను వీడియో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తుల దుశ్చర్యలను ప్రముఖ నటీమణులు అనుష్కాశర్మా, అలియాభట్ లు ఖండించారు. అటువంటి కిరాతక, రాక్షస చర్యలకు పాల్పడే వారు సమాజానికి చీడపురుగుల్లాంటి వారని, వారిని సులభంగా వదిలి పెట్టకోడదని అన్నారు. ఓ జంతువు ప్రాణంతో చెలగాటమాడటం నిజంగా క్షమించరాని నేరంగా పరిగణించాలని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని తమ ట్వీట్స్ లో తెలిపారు. జంతు హింసకు పాల్పడిన వారిని వదల కూడదంటూ సదరు నటీమణులు జంతు ప్రేమికులకు మద్దుతుగా నిలిచారు. -
బాలీవుడ్ గుండె బరువెక్కింది!
బ్రసెల్స్ వరుస పేలుళ్లపై ఉగ్రదాడిపై బాలీవుడ్ స్పందించింది. సోషల్ మీడియాలోబాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీ నటులు బ్రసెల్స్ పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి పేలుళ్లను చూడడం చాలా బాధగా ఉంటుందని హీరోయిన్ ఆలియా భట్ ట్వీట్ చేసింది. ఇంకా హీరోలు అనిల్ కపూర్, హృతిక్ రోషన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హీరోయిన్ ప్రీతి జింటా తదితరులు ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు. కాగా పారిస్ ఉగ్రదాడిని మర్చిపోకముందే.. యూరోప్ మరోసారి బాంబుదాడులతో దద్దరిల్లింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలోనూ, మెట్రో స్టేషన్లోనూ బాంబులు పేల్చిన ముష్కర మూకలు మారణహోమం సృష్టించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 34మంది మరణించగా వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే. Heart goes out to those affected by the #BrusselsAttacks !!! Scary to have to witness blasts like these.. Disturbing!!#prayersforBrussels — Alia Bhatt (@aliaa08) March 22, 2016 Really saddened by the Brussels killings!! Can't believe all of us belong to the same species !!! Just feel so helpless and frustrated ! — Shankar Mahadevan (@Shankar_Live) March 23, 2016 Heartbreaking & shocking to hear of the #BrusselsAttacks. My prayers & condolence to the families affected. RIP,the departed. #unacceptable — Preity zinta (@realpreityzinta) March 22, 2016 When people come to believe that taking lives is a justifiable means to an end, it is humanity that has failed... #Brussels, we stand with u — Jai Singh Rathore (@AnilKapoor) March 22, 2016 -
అక్క బాటలోనే నడుస్తున్నాఅలిబట్