ఆలియా @ కియారా | Kiara Advani changed her name from Aaliya | Sakshi
Sakshi News home page

ఆలియా @ కియారా

Published Sat, May 11 2019 12:44 AM | Last Updated on Sat, May 11 2019 12:44 AM

Kiara Advani changed her name from Aaliya - Sakshi

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక హీరోయిన్స్‌ కొన్నిసార్లు స్క్రీన్‌ నేమ్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పేరు కంటే వేరే పేరు బావుంటుందని దర్శక–నిర్మాతలు సూచించడమో, లేదా అదే పేరుతో వేరే వాళ్లు ఉన్నప్పుడో స్క్రీన్‌ నేమ్‌ పెట్టుకుంటుంటారు. కియార అద్వానీ అసలు పేరు కియార కాదట. స్క్రీన్‌ కోసం నేమ్‌ చేంజ్‌ చేసుకున్నారట. ‘నా అసలు పేరు ఆలియా.

ఆల్రెడీ ఆలియా భట్‌ ఉంది కాబట్టి పేరు మార్చుకోమని సల్మాన్‌ సూచించారు’ అన్నారు కియారా అద్వానీ. ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. ‘భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్‌ స్టోరీస్‌’తో సౌత్‌లోనూ పాపులర్‌ అయ్యారు. తన పేరు బాలీవుడ్‌ బారసాల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘స్క్రీన్‌ నేమ్‌ మార్చుకోవాలని సల్మాన్‌ చెప్పారు. కియారా అనే పేరుని నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంట్లో కూడా కియారా అనే పిలుస్తున్నారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement