Screen name
-
దిలీప్ కుమార్ ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా?
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ మరణం చిత్రపరిశ్రమను అశనిపాతంలా తాకింది. తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన నేడు(జూలై 7న) అందరికీ వీడ్కోలు చెప్తూ నింగికేగాడు. అందరికీ దిలీప్ కుమార్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు వరకు ఆయనను అందరూ ఇదే పేరుతోనే పిలిచేవారు. మరి ఆయన పేరెందుకు మార్చుకున్నాడు? ఎవరు మార్చారు? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. యూసఫ్ ఖాన్‌కు నటుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. తను తెరకెక్కించిన 'జ్వర్ భాతా' సినిమా ద్వారా ఆయనను కథానాయకుడిగా పరిచయం చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. నిన్ను నటుడిగా ఆవిష్కరించబోతున్నానని, దానికంటే ముందు నీకు స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని యూసఫ్ ఖాన్‌తో చర్చించింది. అప్పుడు ఆ స్క్రీన్ నేమ్‌తోనే అందరూ పిలుస్తారని, అందులోనూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరైతే బాగుంటుందని అభిప్రాయపడింది. అంతేకాక ఏ పేరు పెడితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అనే పేరును కూడా ఆవిడే సూచించింది. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్‌గా స్థిరపడ్డాడు. -
ఆలియా @ కియారా
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక హీరోయిన్స్ కొన్నిసార్లు స్క్రీన్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పేరు కంటే వేరే పేరు బావుంటుందని దర్శక–నిర్మాతలు సూచించడమో, లేదా అదే పేరుతో వేరే వాళ్లు ఉన్నప్పుడో స్క్రీన్ నేమ్ పెట్టుకుంటుంటారు. కియార అద్వానీ అసలు పేరు కియార కాదట. స్క్రీన్ కోసం నేమ్ చేంజ్ చేసుకున్నారట. ‘నా అసలు పేరు ఆలియా. ఆల్రెడీ ఆలియా భట్ ఉంది కాబట్టి పేరు మార్చుకోమని సల్మాన్ సూచించారు’ అన్నారు కియారా అద్వానీ. ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్’తో సౌత్‌లోనూ పాపులర్ అయ్యారు. తన పేరు బాలీవుడ్ బారసాల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘స్క్రీన్ నేమ్ మార్చుకోవాలని సల్మాన్ చెప్పారు. కియారా అనే పేరుని నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంట్లో కూడా కియారా అనే పిలుస్తున్నారు’’ అన్నారు. -
ఒక కొత్తమ్మాయి ఒక పాత సెంటిమెంటు!
కొత్త ముఖం తాను కొత్తగా పరిచయం చేసే కథానాయికలకు ‘యం’తో మొదలయ్యే పేర్లు పెట్టడం డెరైక్టర్ సుభాష్ ఘయ్‌కు ఉన్న సెంటిమెంట్. ‘కాంచి’ సినిమా కథానాయిక అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. అయితే ఆమె పేరును తన సెంటిమెంట్ ప్రకారం ‘మిస్తి’గా మార్చాడు. ‘యం’ సెంటిమెంట్ ఏమిటి? అని అడిగితే- ‘యం’ ఫర్ మదర్... స్త్రీ అంటే తల్లితో సమానం... అంటాడు ఘయ్. మిస్తి అనే పేరేమిటి? కాస్త విచిత్రంగా ఉంది... అనేకదా మీ డౌటు? అసలు విషయం ఏమిటంటే, ఇంద్రాణి నిక్‌నేమ్ ‘మిస్తి’! ఎలాగూ ఈ పేరు ‘యం’తో మొదలవుతుంది కాబట్టి నిక్ నేమ్‌నే అసలు పేరు చేశాడు సుభాష్ ఘయ్. ఘయ్ సెంటిమెంట్ గోల పక్కన పెడదాం. ఇంతకీ ఇంద్రాణి తన ‘స్క్రీన్ నేమ్’ మీద సంతృప్తిగా ఉందా? ఆమె ఇలా అంటుంది- ‘‘నా పేరు ఇంద్రాణి అనే విషయం చాలామందికి తెలియదు తెలుసా! నేను మిస్తిగానే అందరికి తెలుసు’’ (బాప్రే!) ‘కాంచి’ సినిమాకు అనూహ్యమైన స్పందన ఏమీ రాలేదు. ‘పాత సీసాలో కొత్త హీరోయిన్’ అని కొందరు వెక్కిరించారు. మిస్తి నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత విజయమేమీ సాధించలేదు. ‘‘సినిమా సూపర్ హిట్ కాలేదు కదా. మరి మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా?’’ అని అడిగితే- ‘‘అదేమీ లేదు. మూడు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాను’’ అంటుంది. ‘‘వాటి వివరాలు చెబుతారా?’’ అని అడిగితే- ‘‘పూర్తి వివరాలు త్వరలోనే’’ అని అంటుంది మాటలు నేర్చిన మిస్తి!