![బాలీవుడ్ గుండె బరువెక్కింది! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71458723309_625x300.jpg.webp?itok=DdNogMsN)
బాలీవుడ్ గుండె బరువెక్కింది!
బ్రసెల్స్ వరుస పేలుళ్లపై ఉగ్రదాడిపై బాలీవుడ్ స్పందించింది. సోషల్ మీడియాలోబాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీ నటులు బ్రసెల్స్ పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి పేలుళ్లను చూడడం చాలా బాధగా ఉంటుందని హీరోయిన్ ఆలియా భట్ ట్వీట్ చేసింది. ఇంకా హీరోలు అనిల్ కపూర్, హృతిక్ రోషన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హీరోయిన్ ప్రీతి జింటా తదితరులు ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు.
కాగా పారిస్ ఉగ్రదాడిని మర్చిపోకముందే.. యూరోప్ మరోసారి బాంబుదాడులతో దద్దరిల్లింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలోనూ, మెట్రో స్టేషన్లోనూ బాంబులు పేల్చిన ముష్కర మూకలు మారణహోమం సృష్టించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 34మంది మరణించగా వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే.
Heart goes out to those affected by the #BrusselsAttacks !!! Scary to have to witness blasts like these.. Disturbing!!#prayersforBrussels
— Alia Bhatt (@aliaa08) March 22, 2016
Really saddened by the Brussels killings!! Can't believe all of us belong to the same species !!! Just feel so helpless and frustrated !
— Shankar Mahadevan (@Shankar_Live) March 23, 2016
Heartbreaking & shocking to hear of the #BrusselsAttacks. My prayers & condolence to the families affected. RIP,the departed. #unacceptable
— Preity zinta (@realpreityzinta) March 22, 2016
When people come to believe that taking lives is a justifiable means to an end, it is humanity that has failed... #Brussels, we stand with u
— Jai Singh Rathore (@AnilKapoor) March 22, 2016