Nawazuddin Siddiqui Estranged Wife Aaliya Found Love Again, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Aaliya: ఆ బంధం నుంచి బయటపడేందుకు 19 ఏళ్లు.. ఇన్నాళ్లకు సంతోషంగా

Published Mon, Jun 5 2023 5:41 PM | Last Updated on Mon, Jun 5 2023 6:30 PM

Nawazuddin Siddiqui Estranged wife Aaliya Found Love Again - Sakshi

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖి- ఆలియాలు ఏదో ఒక వివాదంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే! తనను, తన పిల్లలను రోడ్డున వదిలేశాడని ఆలియా, ఆమె తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ నవాజుద్దీన్‌ కోర్టు మెట్లెక్కారు. వీరిద్దరూ విడిపోయారే కానీ ఇంతవరకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు.

అయితే ఆలియా అప్పుడే తన జీవితంలో మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. తన లైఫ్‌లోకి ఓ ముఖ్యమైన వ్యక్తిని స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'ఒక బంధం నుంచి బయటపడటానికి 19 ఏళ్లు పట్టింది. కానీ నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. నేనిచ్చే ప్రాధాన్యతలో ఎటువంటి మార్పు లేదు. కానీ కొన్ని బంధాలు ఎంతో ముఖ్యమైనవి.

ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు చాలా సంతోషంగానూ ఉంది. ఈ హ్యాపీనెస్‌ను మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు ఆనందంగా ఉండే హక్కు లేదంటారా? చెప్పండి..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు 'ఇప్పటికైనా సంతోషంగా ఉన్నావు, అది చాలు', 'ఇక మీదట నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: గ్రాండ్‌గా సీనియర్‌ నటి సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement