తెలంగాణ ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కావటంతో ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టారు చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో కేసీఆర్‌గా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా నవాజుద్ధీన్ సిద్ధీఖీ పేరు తెరమీదకు వచ్చింది. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్ధీన్ పాత్రల ఎంపికలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. క్యారెక్టర్ కోసం ఫిజికల్ కూడా ఎలాంటి మార్చులు చేసేందుకైన సిద్ధపడే నవాజ్ అయితే కేసీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు.