
ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్న హీరో!
పారితోషికం తేకుండా ఈ హీరో సినిమా నటించాడంటే ఆశ్చర్యమే.
ముంబై: సినిమాల్లో హీరోలకు పారితోషికం కోట్ల రూపాయల్లో ఉంటుంది. చిన్నపెద్దా తేడా లేకుండా కథానాయకులు కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోజులివీ. అలాంటి పారితోషికం లేకుండా ఓ హీరో సినిమా నటించాడంటే ఆశ్చర్యమే. ఇటీవల విడుదలైన 'హరాంకోర్' హిందీ సినిమాలో హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటించాడట. ఒక్క రూపాయి టోకెన్ ఎమౌంట్ మాత్రమే తీసుకున్నాడని దర్శకుడు శ్లోక్ శర్మ తెలిపాడు.
‘నవాజ్ తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన వారిలో చాలా మంది పారితోషికం తీసుకోలేదు. కొంతమంది తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. నవాజ్ కు ఈ సినిమా కథ బాగా నచ్చింది. బడ్జెట్ లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని అతడు సహకరించాడు. నిజంగా చెప్పాలంటే ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. అతడి సహకారం లేకపోతే ఈ సినిమా తీయలేకపోయే వాళ్లమ’ని శ్లోక్ శర్మ పేర్కొన్నాడు. గునీత్ మెంగా, అనురాగ్ కశ్యప్ నిర్మించిన 'హరాంకోర్' టీచర్, స్టుడెంట్ ప్రేమకథతో తెరకెక్కింది.