బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు. పిల్లల భవిష్యత్ కోసం, తన కోసం తన భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు.. ఈ క్రమంలో తమ వివాహ బంధానికి మరోక అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు అలియా. గత ఏడాది మే నెలలో భర్త నవాజుద్దీన్‌పై అలియా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల వివాహబంధంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే నవాజుద్దీన్ సోదరుడు కూడా తనని వేధించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో నవాజుద్దిన్ నుంచి విడాకులు కోరుకుంటూ వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఆయనకు నోటీసులు కూడా పంపారు. కరోనా రాకపోయి ఉంటే.. ఈ జంట ఈ పాటికి విడాకులు పొందేవారు.
అయితే దాదాపు ఏడాది తరువాత అలియా తన మనసు మార్చుకున్నారు. కోవిడ్ తన కళ్ళు తెరిపించిందని.. కష్ట సమయాల్లో తన భర్త నవాజుద్దిన్ పిల్లలతో పాటు తనని కూడా ఆదుకున్నారు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను కోవిడ్ బారిన పడ్డ సమయంలో నా భర్త నాతో పాటు పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి ఆయన తోడుగా నిలిచారు. మా పిల్లలకు మేము కావాలి, మేము కలిసి ఉండడమే వారికి సంతోషం. అందుకే మా మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని భావించాను. అందుకే విడిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను’’ అన్నారు.
ఇక ఇదే విషయంపై నవాజుద్దీన్ సైతం స్పందించారు. ‘‘పిల్లలు యాని, శోరా భవిష్యత్తే నా ప్రాధాన్యత. ఇప్పటికీ అలియా వాళ్ళ అమ్మనే. అలాగే మేము కలిసి పదేళ్లు కాపురం చేశాం. విషయం ఏదైనా నా సపోర్ట్ ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. మా మధ్య ఉన్న విభేదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. వారే నా మొదటి ప్రాధాన్యత’’ అన్నారు. అందుకే కలిసి ఉండడానికి ఇద్దరూ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి పెళ్లి బంధం కొనసాగుతుందని తెలుస్తోంది.
చదవండి:
ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నా!
‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’
Comments
Please login to add a commentAdd a comment