క్రైమ్‌కి ఓకే! | Nawazuddin Siddiqui to turn criminal for his next? | Sakshi
Sakshi News home page

క్రైమ్‌కి ఓకే!

Nov 6 2017 12:16 AM | Updated on Nov 6 2017 12:16 AM

Nawazuddin Siddiqui to turn criminal for his next? - Sakshi

అవును... తమన్నా నేరంతో నేస్తం చేయబోతున్నారట. ఆ నేరం పేరు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ఆ మధ్య విడుదలైన ‘మామ్‌’లో డిటెక్టివ్‌గా నటించిన నవాజూద్దీన్‌ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌’గా బాలీవుడ్‌లో దూసుకెళుతోన్నారు. ఈయనతో తమన్నా ఎందుకు చేతులు కలిపారంటే? ఓ హిందీ సినిమా కోసం. నవాజుద్దీన్‌ ముఖ్య పాత్రలో ఓ క్రైమ థ్రిల్లర్‌ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో తమన్నా నటించనున్నారని బీ–టౌన్‌ టాక్‌.

కథ వినగానే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కి తమన్నా ఓకే అన్నారట. అయితే ఆమె నటించనున్నది నవాజుద్దీన్‌ సరసన కాదు. ఓ కీలక పాత్ర అట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం వివేక్‌ ఒబెరాయ్‌తో ‘ప్రిన్స్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన కూకీ వి. గులాటీ ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కి దర్శకుడు. ప్రస్తుతం హిందీ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ఇన్‌సెట్‌లో ఇసుక మీద హాయిగా సేద తీరుతున్న తమన్నా ఫొటో అక్కడిదే.

ఈ ఫొటో చూసి... సముద్ర తీరంలో తమన్నా హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు. బాగా ఎక్సర్‌సైజ్‌ చేసి, అలసిపోయారు. మామూలుగా ఇక్కడ ఉంటే ఇన్‌డోర్‌లో జిమ్‌లో వర్కవుట్స్‌ చేసేవారు. ఫ్రాన్స్‌లో మాత్రం అవుట్‌డోర్‌ వర్కవుట్స్‌ చేశారట. అలసిపోయే రేంజ్‌లో వ్యాయామాలు చేసి, ఇదిగో ఇలా ఇసుక మీద సేద తీరుతున్నారు. ‘‘అవుట్‌డోర్‌ ట్రైనింగ్‌ చాలా బాగుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement