‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’ | Nawazuddin Estranged Wife Response After Nice Allegations | Sakshi
Sakshi News home page

నవాజుద్దీన్‌ తమ్ముడిపై ఆరోపణలు.. స్పందించిన అలియా

Published Wed, Jun 3 2020 2:20 PM | Last Updated on Wed, Jun 3 2020 2:25 PM

Nawazuddin Estranged Wife Response After Nice Allegations - Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తమ్ముడు.. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వరసకు కూతురు అయ్యే ఓ యువతి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నవాజుద్దీన్‌ భార్య అలియా సిద్ధిఖీ స్పందించారు. ‘ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికే దేవుడు నాకు ఎంతో మద్దతిచ్చాడు ధన్యవాదాలు. తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్నాళ్లు నాలానే మౌనంగా బాధపడిన వారిని చూసి ప్రపంచం షాక్‌కు గురవుతుంది. డబ్బు నిజాన్ని ఎంతవరకు కొనగలదో.. వారు ఎవరెవరికి లంచం ఇస్తారో చూడాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.
 

వివాహం అయిన దశాబ్దం తర్వాత అలీయా విడాకులు కోరారు. పెళ్లైన ఏడాది నుంచే నవాజ్ కుటుంబం తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేసిందని ఆలియా పేర్కొన్నారు. అంతేకాక డబ్బు, అధికారం ఉపయోగించి తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
(రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement