Nawazuddin Siddiqui Reveals He Was Offered 200 Scripts In 3 Months: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా తన విలక్షణమైన నటనతో దూసుకుపోతున్నాడు బీటౌన్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. థాక్‌రే, మాంటో, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భజరంగీ భాయిజాన్, బదలాపూర్, మాన్‌సూన్ షూట్ అవుట్ వంటి తదితర చిత్రాలతో అలరించాడు. వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నవాజుద్దీన్ తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వద్దకు 3 నెలల్లో 200 స్క్రిప్ట్‌లు వచ్చాయని తెలిపాడు. కానీ వాటన్నింటికి 'నో' చెప్పి కేవలం ఐదింటికి మాత్రమే ఓకే చెప్పినట్లు పేర్కొన్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఎందుకంటే తాను కీర్తి, డబ్బు కోసం సినిమాలు ఒప్పుకోనని వివరించాడు.
ఇప్పుడు తాను అంగీకరించిన చిత్రాల్లో విభిన్నమైనవి కాబట్టే ఒప్పుకున్నట్లు తెలిపాడు నవాజుద్దీన్. ఈ సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నాడు. కంటెంట్ లేని కథ అయిన సరే పాత్ర విభిన్నంగా, అద్భుతంగా ఉంటే చేస్తాని చెప్పుకొచ్చాడు. ముందుగా ఒక లైన్‌లో కథ వింటానని, అది ఆసక్తికరంగా ఉంటేనే పూర్తి కథ చెప్పమంటానని తెలిపాడు. 'చాలామంది బాలీవుడ్ తారలు విరామం కోసం దేశవిదేశాలకు వెళ్తుంటారు. కానీ నాకు మాత్రం సినిమాలు చేస్తుంటూనే రిలాక్స్‌గా ఉంటుంది.' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ పేర్కొన్నాడు. ప్రస్తుతం 'హీరోపంతి 2', 'టికు వెడ్స్ షెరు' చిత్రాలలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment