
లక్నో: కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ రైతుగా మారారు. తన సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నారు. అతనికి వ్యవసాయమంటే చాలా ఇష్టమట. తన వ్యవసాయ క్షేత్రంలోని పచ్చని పొలాల్లో పనిచేసిన సిద్ధిఖీ, కాలువలోని నీటితో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించారు. తలకు కండువా కట్టుకుని.. భుజంపై పార పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సిద్ధిఖీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈరోజుకి పని పూర్తయింది..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
(చదవండి: ‘సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వారం గడిచింది’)
కాగా, నవాజుద్దీన్ సిద్దిఖీ సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్. అతడి సోదరి ఇటీవల మరణించడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని అంత్యక్రియలకు హాజరయ్యాడు. అనంతరం 14 రోజుల క్వారైంటన్ పూర్తి చేసుకుని సొంతూరిలో రైతుగా మారిపోయాడు. తన తల్లి కోసమే ప్రస్తుతం అక్కడ ఉంటున్నట్టు సిద్ధిఖీ ఇదివరకే తెలిపారు. కాగా, భార్య ఆలియా అతనికి విడాకుల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే దానిపై అతను ఇంకా స్పందించలేదు.
(చదవండి: కేసు వాపసు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు)
Comments
Please login to add a commentAdd a comment