ఢిల్లీ: నవాజుద్దీన్ సిద్దిఖీ... దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు. వైవిద్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. పాత్ర ఏదైనా సరే, దానికి అనుగుణంగా నటించగలిగే సామర్థ్యం అతడి సొంతం. అలాంటి వ్యక్తి కూడా కుల వివక్షకు గురయ్యాడంటే నమ్మగలమా. కానీ తన స‍్వగ్రామంలో ఇంకా కుల వివక్షకు గురవుతున్నానని నవాజుద్దీన్ వెల్లడించాడు. ' నేను నటనతో ఫేమస్ అయినప్పటికీ మా గ్రామంలో నన్ను ఇంకా తక్కువ కులం వాడిలాగే చూస్తారు. కులం అనేది వారి నరనరాల్లో పాకి ఉంది. అది వారు గర్వంగా చెప్పుకుంటారు. మా అమ్మమ్మ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఎప్పటికీ వారు అంగీకరించరు' అని సిద్దిఖీ పేర్కొన్నాడు.
లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా సిద్దిఖీ తన స్వగ్రామంలోనే సమయం గడిపాడు. ఇటీవలే సుధీర్ మిశ్రా దర్శకత్వంలో 'సీరియస్ మెన్' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్దిఖీ ఒక దళితుని పాత్రలో నటించాడు. మనూ జోసెఫ్ రచించిన సీరియస్ మెన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీయడం విశేషం.
(ఇదీ చదవండి: ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను)
Comments
Please login to add a commentAdd a comment