
Actor Nawazuddin Siddiqui About South India Movies: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. ఈ వార్ మధ్యలోకి ఆర్జీవీ దూరి బాలీవుడ్‌కు చురకలు అట్టించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురింది. ఈ నేపథ్యంలో దీనిపై వరుసగా బాలీవుడ్, సౌత్ స్టార్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, మనోజ్ బాజ్‌పాయి వంటి అగ్ర నటులు ఈ వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించారు.
చదవండి: షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి
తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో దక్షిణాది సినిమాలు ‘పుష్మ: ది రైజ్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్ 2’లు బాలీవుడ్‌లో భారీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఏ దక్షిణాది సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలనే కాదు, కమర్షియల్ సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. అంతేగాక ప్రస్తుతం నాకు అంత సమయం కూడా లేదు. కాబట్టి నేను వీటి సక్సెస్‌పై ఎలాంటి కామెంట్ చేయలేను’ అని బదులిచ్చారు.
అనంతరం తాజాగా పరిశ్రమలో నెలకొన్న హిందీ భాష వివాదం, బాలీవుడ్‌పై వస్తున్న విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. లాక్‌డౌన్ నుంచి సినిమాలపై ప్రేక్షకుడి అభిరుచి మారిందని ఆయన అన్నారు. ‘ఒక సినిమా హిట్ అయితే అంతా కలిసి దాన్ని ఆకాశానికెత్తడం. అంతగా కలెక్షన్స్ రాకుంటే వెంటనే విమర్శలు గుప్పించడం సాధారణమైంది. ఇప్పుడిదో ఫ్యాషన్ అయిపోంది. ఈ ట్రెండ్ కూడా పరిస్థితులను బట్టి మారుతోంది. బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌బస్టర్ పడితే అంతా సర్దుకుంటుంది’ అన్నారు.
చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది
అలాగే లాక్‌డౌన్‌లో అంతర్జాతీయ సినిమాలు చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని తాను ముందుగానే ఊహించానన్నారు. కానీ ఈ మార్పు అంత మంచిది కాదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదిరిస్తున్నారన్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇక తాము కూడా హీరో పంటి-2 వంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, అవి కలెక్షన్ల పరంగా తమ సినిమాలు భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment