నటుడు రజనీకాంత్ విలన్‌తో మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ అమ్మడికి ఇటీవల సరైన హిట్స్ లేవనే చెప్పాలి. తెలుగులో వెంకటేష్‌తో జతకట్టిన ఎఫ్ 2 చిత్రమే ఈ తమన్నాకు చివరి సక్సెస్‌ఫుల్ చిత్రం. ఆ తరువాత కోలీవుడ్‌లో ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ఈ బ్యూటీ సరైన సక్సెస్‌ను చూసి చాలా కాలమైంది. ఆ మధ్య ఉదయ*నిధి స్టాలిన్‌తో నటించిన కన్నె కలైమానే చిత్రం నటిగా ప్రశంసలను అందించిందిగానీ చిత్రం ఆడలేదు.
ప్రస్తుతం కోలీవుడ్‌లో విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు హిందీలో నటించిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం ఖామోషి డిజాస్టర్‌గా నిలిచింది. అయినా లక్కీగా బాలీవుడ్‌లో మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా వార్త. అవును హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్‌తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నా ఇంటి తలుపుతట్టింది. నవాజుద్దీన్ సిద్ధిక్ తమిళంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో విలన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే.
ఈయన తాజాగా హిందీలో హీరోగా నటించనున్న చిత్రంలో నటి తమన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీకి బోలే చుడియాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి కొత్త దర్శకుడు శ్యామ్స్ నవాబ్ సిద్ధిక్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్‌కు సోదరుడు ఈ దర్శకుడే తన చిత్రంలో నటి తమన్నా హీరోయిన్‌గా నటించనున్న విషయాన్ని సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.
దీనికి స్పందించిన తమన్నా తాను బోలే చుడియన్ చిత్రంలో ఒక భాగం కానుండడం చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ అమ్మడికి బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ సరైన హిట్ తగల్లేదు. ఈ కొత్త చిత్రం అయినా మంచి సక్సెస్‌ను అందిస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment