
మూడు గంటలు చాలవని అమితాబ్ బచన్ అంటున్నారు. దేనికి మూడు గంటలు? బాల్ థాకరే జీవిత చరిత్రను సినిమాగా తియ్యడానికట. ‘థాకరే’ మూవీ టీజర్‌ని రిలీజ్ చేస్తూ అమితాబ్ ఈ మాట అన్నారు. సినిమాలో థాకరే పాత్రను పోషిస్తున్నది మాత్రం అమితాబ్ కాదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ! స్క్రిప్టు ఎవరో తెలుసా? శివసేన ఎంపీ సంజయ్ రౌత్. డైరెక్షన్ అభిజిత్. ‘అసలు ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు’ అని టీజర్ లాంచ్‌లో ఎగ్జయిట్ అయ్యాడు సిద్ధిఖీ. ‘‘ఎవరికైనా డౌట్ వస్తుంది.
ఇతడు మరాఠీ ఎలా మాట్లాడగలడు? అది కూడా థాకరే స్టైల్లో.. అని. కానీ థాకరే నన్ను పైనుంచి బ్లెస్ చేస్తారని నా నమ్మకం’’ అన్నాడు సిద్ధిఖీ ఎంతో కాన్ఫిడెంట్‌గా. ఇక అమితాబ్ అన్న మాట దగ్గరికి వద్దాం. థాకరే జీవితాన్ని మూడు గంటల్లో ఎందుకు చూపలేమంటే.. ఆయన వ్యక్తిత్వం, జీవితం సినిమాకు అందనివి. బాల్ థాకరే బర్త్‌డే జనవరి 23న. ఆ రోజు ఈ బయోపిక్‌ని రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘శివసేన’ పార్టీని స్థాపించి, మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన థాకరే 86 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన లైఫ్ అంతా పరవళ్లు తొక్కిన ప్రవాహం. మరి ఆ వేగాన్ని నవాజుద్దీన్ íసిద్ధిఖీ తన నటనతో అందుకోగలడా? సిద్ధికీ అందుకోలేడంటే.. కనుచూపు మేరలో ఇంకెవరూ అందుకోలేరనే అనుకోవాలి. హి ఈజ్ ద బెస్ట్ చాయిస్.