బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటి పనిమనిషి దుబాయ్‌లో అవస్థలు పడుతోంది. తినడానికి ఆహారం లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తోంది. ఈ విషయాన్ని నవాజుద్దీన్ భార్య ఆలియా తరఫు న్యాయవాది తన ట్విటర్‌లో షేర్ చేశారు. సప్నా ఏడుస్తూ చెబుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయిందని పేర్కొన్నారు. దుబాయ్‌లో నవాజుద్దీన్ ఇంటిలో అతని పిల్లలను చూసుకునేందుకు సప్నా అనే అమ్మాయిని నవంబర్‌లో 2022లో నియమించుకున్నారు.
అయితే ట్విటర్‌లో సప్నా నియామకానికి సంబంధించిన స్టేట్‌మెంట్ కూడా ఉంది. వీసా ఫీజుల పేరుతో నవాజుద్దీన్ ఆమెకు కనీసం జీతం కూడా ఇవ్వడం లేదని ఆలియా తరఫున న్యాయవాది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సప్నా దగ్గర తినడానికి తిండి, డబ్బు లేదని వివరించారు. సప్నాను ఓ కెంపెనీలో సేల్స్ మేనేజర్‌గా నియమించుకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బాలికను ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రిజ్వాన్ అధికారులను కోరారు. నవాజుద్దీన్‌తో సప్న దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. సప్నా తనకు పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లించాలని.. భారతదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేయాలని నవాజుద్దీన్‌ను వీడియోలో కోరింది.
కాగా.. నవాజుద్దీన్ భార్య ఆలియా, అతని పిల్లలు షోరా, యాని 2021లో దుబాయ్‌కి వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆలియా భారతదేశానికి తిరిగి వచ్చారు. అతని అంధేరి బంగ్లాలో ఉంటున్నారు.మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య ఆలియాతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఆలియా తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The video & my statement speaks for itself. Govt authorities are requested to urgently rescue the house help of @Nawazuddin_S from Dubai where the girl is in a state of Solitary Confinement@cgidubai @UAEembassyIndia @LabourMinistry @HRDMinistry@MEAIndia @CPVIndia @OIA_MEA pic.twitter.com/EyQ8DiHPG2
— Advocate Rizwan Siddiquee (@RizwanSiddiquee) February 19, 2023
Comments
Please login to add a commentAdd a comment