
తమ హీరోలు బయట కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే. కానీ, ఆ హీరోలకు మాత్రం చేదు సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. మొన్నీమధ్య విజయ్ సేతుపతి ఇలాగే అభిమాన గణం మధ్యలో ఇరుక్కుపోయాడు. అయినా సరే ఫ్యాన్స్ కోరినన్ని సెల్ఫీలు ఇచ్చాడు. అయినా ఫ్యాన్స్ మాత్రం చుట్టుముట్టేసి వదల్లేదు. మెల్లగా ఏదోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇదొక రకమైన సంఘటన అనుకుంటే.. తాజాగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి చేదు సంఘటన ఎదురైంది.
నవాజుద్దీన్ బయట కనిపించేసరికి ఫ్యాన్స్ ఎగబడిపోయారు. చుట్టూ సెక్యురిటీ ఉన్నా.. ఓ ఆకతాయి మాత్రం అమాంతం నవాజుద్దీన్‌ను వెనక్కు లాగేసి మరి.. సెల్ఫీ తీసుకోబోయాడు. వెంటనే సెక్యురిటీ అప్రమత్తమై ఆయన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలు అభిమానంతో చేస్తారో.. లేక సెల్ఫీల పిచ్చితో చేస్తారో అంటూ నెటిజన్లు సదరు వ్యక్తికి చీవాట్లు పెడుతున్నారు.