'మిస్ లవ్లీకి సెన్సార్ బోర్డు 157 కట్స్'
Published Tue, Dec 24 2013 3:19 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న 'మిస్ లవ్లీ' చిత్రానికి సెన్సార్ బోర్డు 157 కట్స్ ను సూచించిందని ఆ చిత్ర దర్శకుడు ఆశీమ్ అహ్లూవాలియా తెలిపారు. భారత దేశంలో మిస్ లవ్లీ చిత్రాన్ని ప్రదర్శించాలంటే 157 సీన్లను తొలగించాల్సిందేనని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధమవుతోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ, నిహారికా సింగ్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సర్టెన్ రిగార్డ్ సెక్షన్ లో గట్టిపోటి ఇచ్చింది.
భారతీయ సెన్సార్ బోర్డును ఒప్పించడానికి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది అని అహ్లువాలియా తెలిపారు. సెన్సార్ బోర్డు నాలుగుసార్లు సమీక్షించిన తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 17 తేదిన విడుదల చేసేందుకు సిద్దమయ్యాం అని అన్నారు. '157 కట్స్ అంటే సినిమాను చంపేయడమే, ఇక చిత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం లేదు' అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. సెన్సార్ బోర్బును ఒప్పించడం చాలా కష్టమైంది అని అన్నారు.
అయితే మా చిత్రం పక్కా సీ గ్రేడ్ చిత్రం..కుటుంబ పరమైన భాష మాట్లాడటానికి అవకాశమే లేదు అని అన్నారు. అయినా కొన్ని సీన్లను తొలిగించాడనికి ఒప్పుకోవడంతో ప్రేక్షకుల ముందుకు 'మిస్ లవ్లీ' వస్తోంది అని అన్నారు. ఈ చిత్ర విజయానికి ఎలాంటి ట్రిక్స్ ప్రదర్శించడం లేదు అని.. కేవలం ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం అని అహ్లూవాలియా తెలిపారు.
Advertisement