Nawazuddin Siddiqui Defends Romantic Pairing With Avneet Kaur - Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: 21 ఏళ్ల హీరోయిన్‌తో 50 ఏళ్ల నటుడి రొమాన్స్‌.. తప్పేంటన్న నటుడు

Published Mon, Jun 19 2023 12:33 PM | Last Updated on Mon, Jun 19 2023 1:39 PM

Nawazuddin Siddiqui Defends Romantic Pairing with Avneet Kaur - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్‌ షెరు. ఇందులో దాదాపు 50 ఏళ్ల వయసున్న సీనియర్‌ హీరో నవాజుద్దీన్‌ సిద్దిఖి 21 ఏళ్ల కుర్ర హీరోయిన్‌ అవనీత్‌ కౌర్‌తో జంటగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 29 ఏళ్లుగా ఉంది. ఇకపోతే టీకూ వెడ్స్‌ షెరులో హీరోహీరోయిన్స్‌ రెచ్చిపోయి మరీ లిప్‌లాక్స్‌ ఇచ్చుకున్నారు. ఈ ట్రైలర్‌ చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. సగటు సినీప్రేక్షకుడు ఈ సన్నివేశాలను జీర్ణించుకోలేకపోయారు. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్‌ చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని నటుడిని తిట్టిపోస్తున్నారు.

తాజాగా ఈ విమర్శలపై నవాజుద్దీన్‌ సిద్దిఖి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అసలు మీ సమస్యేంటి? రొమాన్స్‌కు వయసుతో సంబంధమేంటి? మా కాలంలో రొమాన్స్‌ను స్పెషల్‌గా చూసేవాళ్లం. సంవత్సరాల తరబడి ప్రేమలో మునిగి తేలేవాళ్లం. ఇప్పటితరానికి రొమాన్స్‌ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడున్న హీరోలు అలాంటి పాత్రలు చేయడానికి కూడా పనికి రారు. అందుకే షారుక్‌ ఖాన్‌ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నారు. అయినా ఇప్పుడు ప్రేమ, బ్రేకప్‌.. వంటిదంతా వాట్సప్‌లోనే జరిగిపోతోంది. ఇంక నిజమైన రొమాన్స్‌కు చోటెక్కడుంది?' అని ప్రశ్నించారు.

కాగా టీకూ వెడ్స్‌ షెరు చిత్రంలో నవాజ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా, అవనీత్‌ కౌర్‌ నటి కావాలన్న యువతి పాత్రలో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం జూన్‌ 23న విడుదల కానుంది.

చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన తొలి చిత్రం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement