సాక్షి, ముంబై: ప్రముఖ నటి, రచయిత, దర్శకురాలు తెరకెక్కించిన మాంటో ట్రైలర్ దూసుకుపోతోంది. స్వాతంత్ర‍్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. కథా రచయిత సాదత్ హసన్ మాంటో జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో మాంటోగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించగా, మాంటో భార్యగా రసికా దుగ్గల్ నటించారు. ఇంకా రిషి కపూర్, పరేష్ రావల్, ఇలా అరుణ్ గురుదాస్ మ్యాన్ , పరేష్ రావల్, దివ్య దత్తా, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జావేద్ అఖ్తర్ తొలిసారిగా ఈ సినిమాలో నటించారు. కాగా ఈ ఏడాది పోటీపడబోతున్న కేన్స్ 21 చిత్రాల్లో నందితా దాస్ తెరకెక్కించిన ‘మాంటో’ కూడా ఉండటం విశేషం.
విడుదలైన కొన్ని గంటల్లోనే 10లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. దీనిపై చిత్ర దర్శకురాలు నందితా దాస్ స్పందించారు. తమ ట్రైలర్‌కు లభిస్తున్నభారీ మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ధన్యవాదాలు తెలిపారు.
ముంబైలో కథా రచయితగా మాంటో కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. కానీ దేశంలో హింసాకాండ కారణంగా అతికష్టంమీద ముంబై వీడి లాహోర్ పోవాలనే నిర్ణయం తీసుకుంటారు మాంటో. అలా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఆయన నాలుగేళ్ల జీవితంలో రేగిన కల్లోలాన్ని, అత్యంత గందరగోళ పరిస్థితులను పట్టి చూపిస్తుందట ఈ సినిమా.
Comments
Please login to add a commentAdd a comment