Nanditha das
-
ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
సోషల్ మీడియాలో సెలబ్రెటీ షాకింగ్ ఫొటో దర్శనం ఇచ్చింది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు డెలివరి బాయ్‌గా అవతారం ఎత్తి ఒడిసా రోడ్లపై కనిపించాడు. ఇక ఆయనను లైవ్‌గా చూసిన వారంత నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ నటుడు ఎవరంటే బాలీవుడ్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన ఫుడ్ డెలివరి చేస్తూ ఒడిసా రోడ్లపై కనిపించాడు. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ ఆయనను దగ్గరగా చూసినవారు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం కపిల్ శర్మ నటి, దర్శకురాలు నందిత దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఫుడ్ డెలివరి బాయ్ పాత్రలో కనిపించానున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ ఒడిసాలో షూటింగ్‌ను జరుపుకుంది. అక్కడ ఎల్లో కలర్ టీ-షర్ట్, డెలివరి బ్యాగ్, బ్లాక్ హెల్మెట్‌తో ద్విచక్ర వాహనంపై వెళుతూ కనిపించాడు. ఇక ఆయనను అలా చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. దీనికి ‘సర్ మిమ్మల్ని నేను లైవ్‌లో చూశాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌పై కపిల్ స్పందిస్తూ.. ‘ఎవరికి చెప్పకు’ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోతో స్టార్ కమెడియన్‌గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. Kisi ko batana mat 🤓 https://t.co/3rCAjuPKva — Kapil Sharma (@KapilSharmaK9) March 18, 2022 -
డెలీవరీ బాయ్‌గా కమెడియన్ కపిల్ శర్మ
Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film: నందితా దాస్ మంచి నటి మాత్రమే కాదు.. మంచి దర్శకురాలు కూడా. 2008లో ‘ఫిరాక్’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన నందిత ఆ తర్వాత పదేళ్లకు ‘మాంటో’ చిత్రం తెరకెక్కించారు. ఈ గ్యాప్‌లో ఓ షార్ట్ ఫిలిం చేశారు. తాజాగా దర్శకురాలిగా మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో టీవీ వ్యాఖ్యాత కపిల్ శర్మ మెయిన్ లీడ్ చేయనున్నారు. ఇందులో కపిల్ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి కథానాయిక. ‘‘మీ ఆర్డర్ స్వీకరించాం’’ అంటూ, ‘‘ఒక కామన్ మేన్ కథ ఇది అని, ఈ పాత్రకు కపిల్ సరిపోతారనిపించి తీసుకున్నాను’’ అని నందితా దాస్ పేర్కొన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘మాంటో’ ట్రైలర్
సాక్షి, ముంబై: ప్రముఖ నటి, రచయిత, దర్శకురాలు తెరకెక్కించిన మాంటో ట్రైలర్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. కథా రచయిత సాదత్ హసన్ మాంటో జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో మాంటోగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించగా, మాంటో భార్యగా రసికా దుగ్గల్ నటించారు. ఇంకా రిషి కపూర్, పరేష్ రావల్, ఇలా అరుణ్ గురుదాస్ మ్యాన్ , పరేష్ రావల్, దివ్య దత్తా, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జావేద్ అఖ్తర్ తొలిసారిగా ఈ సినిమాలో నటించారు. కాగా ఈ ఏడాది పోటీపడబోతున్న కేన్స్ 21 చిత్రాల్లో నందితా దాస్ తెరకెక్కించిన ‘మాంటో’ కూడా ఉండటం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే 10లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. దీనిపై చిత్ర దర్శకురాలు నందితా దాస్ స్పందించారు. తమ ట్రైలర్‌కు లభిస్తున్నభారీ మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ధన్యవాదాలు తెలిపారు. ముంబైలో కథా రచయితగా మాంటో కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. కానీ దేశంలో హింసాకాండ కారణంగా అతికష్టంమీద ముంబై వీడి లాహోర్ పోవాలనే నిర్ణయం తీసుకుంటారు మాంటో. అలా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఆయన నాలుగేళ్ల జీవితంలో రేగిన కల్లోలాన్ని, అత్యంత గందరగోళ పరిస్థితులను పట్టి చూపిస్తుందట ఈ సినిమా. -
‘మాంటో’ ట్రైలర్ విడుదల
-
నలుపు మెరుపులు
గగనాంతర రోదసిలో దూసుకుపోతున్నా.. ఇలాతలంలో ఇంతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పదిమందిని మెప్పించే మేధస్సు ఉన్నా.. మేని ఛాయను బట్టే మర్యాద ఇచ్చే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తెలుపులో ఉన్నవారిని వలపు తీగలని పొగిడే నోళ్లు.. నలుపు నారాయణుడు మెచ్చునన్న సంగతి మరచి వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వివక్షకు చెక్ పెడుతూ ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే కాన్సెప్ట్ సిటీలో షురూ అయింది. ఒంటి రంగు బంగారు వన్నెలో తళుకులీనినా.. నీడ మాత్రం కనిపించేది నలుపులోనే. యుగయుగాల చరిత్రలోకి తొంగి చూస్తే నలుపు రంగుకు మించిన అందం లేదని తెలుస్తుంది. నారాయణుడు నలుపు.. పార్వతీదేవి నలుపు. త్రేతాయుగంలో రాముడు నీలిమేఘ శ్యాముడు. ద్వాపరానికి వస్తే శ్రీ కృష్ణుడిదే కాదు. ద్రౌపది మేనిఛాయ కూడా నలుపే. ఒకప్పుడు ఒంటిపై నిగనిగలాడిన నలుపు.. ఇప్పుడు కంట్లో నలుసులా మారుతోంది. పురాణకాలంలో ఈ రంగుపై కనిపించని వివక్ష.. నవీనయుగంలో మాత్రం కట్టలు తెంచుకుంది. మగువలు ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. రంగునుబట్టే సమాజం వారికి గౌరవాన్నిస్తోంది. ఈ రుగ్మతను తగ్గించే సంకల్పంతో మొదలైందే ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ క్యాంపెయిన్. చెన్నై టు హైదరాబాద్.. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ కాన్సెప్ట్ ఇండియాలో చెన్నై నుంచి మొదలైంది. కవితా ఇమ్మాన్యుయేల్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ‘బ్లాక్ బ్యూటీ’, నటి నందితాదాస్ సపోర్ట్‌తో మనసులకు పట్టిన నలుపును తుడిచేందుకు పనిగట్టుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పాకిన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ సిటీ స్త్రీల్లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉంది. చామనఛాయా చిత్రాలు.. ఫ్యాషన్ షో, సినీ ఇండస్ట్రీ, ఉద్యోగం...ఇలా ఏ రంగాల్లోనైనా కాస్త రంగు త క్కువగా ఉండే అమ్మాయిలకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి. తెలివికి రంగుతో సంబంధం లేదనే కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డార్క్ అండ్ బ్యూటీఫుల్ ఫొటో ఎగ్జిబిషన్‌కు శ్రీకారం చుట్టింది హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ. ఈ కానె ్సప్ట్ వివరించి ఎంట్రీలను ఆహ్వానించింది. ఫేస్బుక్ ద్వారా సరికొత్త థీమ్‌తో మొదలైన క్యాంపెయిన్‌కు వివిధ రంగాలకు చెందిన మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ష్యాషన్, మీడియా, సినిమా, ఐటీ.. ఇలా తాము ఎంచుకున్న మార్గంలో సక్సెస్ సాధించిన పలువురు మగువలు క్యాంపెయిన్‌లో పాలుపంచుకుంటున్నారు. యాంకర్ ఝాన్సీ, డిజైనర్ అర్చన రావ్, ఆర్టిస్టు ప్రియాంక ఏలే వంటి 50 మంది ప్రముఖులు ఉత్సాహంగా ముందుకువచ్చారు. ఇలా స్పందించిన వారి ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. వాటిని ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. వారిలో ఉన్న ధీమాతో పాటు వారు సాధించిన విజయాలనూ ఫొటో ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 20 వరకు కొనసాగనుంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సాధారణంగా అమ్మాయిలంటేనే వివక్ష కొనసాగుతున్న రోజులివి. ఆడ శిశువు అనగానే కడుపులోనే అంతమొందిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీన్ని దాటి నేలపైకి వచ్చినా అమ్మాయి తెల్లగా, బుర్రగా ఉంటే సరి. నలుపు రంగు వస్తే సమాజంలో నెగెటివ్ ఆలోచన ధోరణి పెరుగుతోంది. దీన్ని నివారించడమే డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్దేశం. ఈ కాన్సెప్ట్‌ను వివరించి ఎంట్రీలను ఆహ్వానించాం. చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. వారు సాధించిన విజయాలను వివరిస్తూ ఏడు రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. - కాళీ సుధీర్, హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యురేటర్ స్టే బ్యూటిఫుల్.. అందమనేది చూసే దృష్టి కోణంలో ఉంటుంది. నలుపు అందం కాదనే వారు నా దృష్టిలో కళ్లుండీ చూపులేనివారే. న్యాయాన్యాయాలకు పర్యాయ పదాలుగా వాడే ఫెయిర్, అన్‌ఫెయిర్ అనే పదాలను ఒంటి రంగులకు వాడటమే మేని ఛాయలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రంగు వ్యక్తిలో కనిపిస్తుందే కానీ వ్యక్తిత్వాన్ని చూపదు. అందుకే స్టే అన్‌ఫెయిర్, స్టే బ్యూటిఫుల్ నినాదంతో మొదలైన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌కు మరింత ప్రచారం కల్పించాలి. నా వరకైతే అయామ్ అన్‌ఫెయిర్, అయామ్ బ్యూటిఫుల్. - ఝాన్సీ, యాంకర్ - త్రిగుళ్ల నాగరాజు