డెలీవరీ బాయ్‌గా కమెడియన్‌ కపిల్‌ శర్మ | Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film | Sakshi
Sakshi News home page

డెలీవరీ బాయ్‌గా కమెడియన్‌ కపిల్‌ శర్మ

Published Fri, Feb 18 2022 7:53 AM | Last Updated on Fri, Feb 18 2022 7:53 AM

Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film - Sakshi

Kapil Sharma To Play Food Delivery Boy In Nandita Das Film: నందితా దాస్‌ మంచి నటి మాత్రమే కాదు.. మంచి దర్శకురాలు కూడా. 2008లో ‘ఫిరాక్‌’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన నందిత ఆ తర్వాత పదేళ్లకు ‘మాంటో’ చిత్రం తెరకెక్కించారు. ఈ గ్యాప్‌లో ఓ షార్ట్‌ ఫిలిం చేశారు. తాజాగా దర్శకురాలిగా మరో సినిమాకి శ్రీకారం చుట్టారు.

ఈ సినిమాలో టీవీ వ్యాఖ్యాత కపిల్‌ శర్మ మెయిన్‌ లీడ్‌ చేయనున్నారు. ఇందులో కపిల్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి కథానాయిక. ‘‘మీ ఆర్డర్‌ స్వీకరించాం’’ అంటూ, ‘‘ఒక కామన్‌ మేన్‌ కథ ఇది అని, ఈ పాత్రకు కపిల్‌ సరిపోతారనిపించి తీసుకున్నాను’’ అని  నందితా దాస్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement