సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. విహాన్ ఫిల్మ్స్ బ్యానర్, గార్లపాటి రమేశ్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లతో కలిసి ఈ చిత్రదర్శకుడు వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సిద్ధార్థ నీలకంఠ అనే లాయర్ పాత్ర చేశాను. పబ్లిక్‌ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్‌ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఆడియన్స్ ఇప్పటివరకూ చూసి ఉండరని నా అభిప్రాయం. ఈ సినిమా కోసం నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.
నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది. ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ‘పట్టుకుంటే పదివేలు’ అనే కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు (ఆడియన్స్) స్పాట్‌లో పది వేలు ఇస్తారు. ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఆ కూపన్‌లో విలన్ ఎవరో చెప్పి... సెకండాఫ్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్‌లో పది వేలు ఇస్తారు. ఇలా 50 సెంటర్స్‌లో ఇవ్వబోతున్నాం’’ అని అన్నారు.
‘‘ఈ సినిమాలో సాయిరామ్ శంకర్‌ను కొత్తగా చూస్తారు’’ అన్నారు వినోద్. ‘‘ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’’ అని కోరారు గార్లపాటి రమేశ్. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే 300 థియేటర్స్‌కు తగ్గకుండా ఈ చిత్రం ప్రదర్శితమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశాం’’ అని తెలిపారు శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు.
Comments
Please login to add a commentAdd a comment