Sai Ram Shankar
-
25 కుక్కలతో యాక్షన్ సీన్.. అదే హైలెట్: హీరో సాయి రామ్ శంకర్
'ఒక పథకం ప్రకారం'సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్‌ని తెచ్చారు. వాటితో ఫైట్ సీన్ షూట్ చేస్తుంటే.. ఓ కుక్క నాపై అటాక్ చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కడినే గ్రిల్లో ఉన్నాను. భయంతో గ్రిల్ ఎక్కేశాను. ఆ పని చేయకపోతే ఆ డాగ్ నన్ను కచ్చితంగా కరిచేది. రిస్క్ చేసి తీసిన ఆ యాక్షన్ సీన్ అదిరిపోయింది’ అన్నారు హీరో సాయి రామ్ శంకర్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సాయి రామ్ శంకర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఒక పథకం ప్రకారం' అంటే 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం.→ వినోద్ కుమార్ విజయన్ మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు డైరెక్టర్ విజయన్. కాబట్టి తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఫైట్ సీన్స్ ని, సాంగ్స్ ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.→ నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.→ గతంలో ఇలాంటి ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్ గా చేశామన్న సంతృప్తి లభించింది.→ ఇప్పటికి తెలుగులో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్ గారు ఇండియన్ టాప్ కెమెరామన్లలో ఒకరు. అలాగే మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కూడా నేర్చుకున్నారు.→ మా సినిమా రిలీజ్ రోజే తండేల్ కూడా వస్తోంది. అయితే ఆ సినిమాతో మాకు పోటీ లేదు. అది చాలా పెద్ద సినిమా. మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం(నవ్వుతూ..)→ ప్రస్తుతం ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. -
కొత్తగా అనిపిస్తుంది: వినోద్ కుమార్ విజయన్
‘‘ఒక పథకం ప్రకారం’(oka pathakam prakaram) స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. తెలుగు ప్రేక్షకులకు మా సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది’’ అని వినోద్ కుమార్ విజయన్(vnod kumar vijayan) అన్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్(Sai Ram Shankar) హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విహాన్ ఫిల్మ్స్ –విహారి సినిమా హౌస్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి వినోద్ కుమార్ విజయన్ నిర్మించడంతో పాటు, దర్శకత్వం వహించారు.శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ సినిమాని తెలుగులో ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ–‘‘చిన్న వయసులోనే కేరళకి వెళ్లాను. అక్కడ చాలా చిత్రాలను నిర్మించాను.. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఫాహద్ ఫాజిల్, గోపీ సుందర్ వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సాయిరామ్, నేను మంచి స్నేహితులం. తనకి ‘ఒక పథకం ప్రకారం’ కథ నచ్చడంతో ఈ మూవీ చేశాం. సాయిరామ్‌తో పాటు శృతీ సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖనిగారి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి’’ అన్నారు. -
ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది: సాయిరామ్ శంకర్
సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. విహాన్ ఫిల్మ్స్ బ్యానర్, గార్లపాటి రమేశ్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లతో కలిసి ఈ చిత్రదర్శకుడు వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సిద్ధార్థ నీలకంఠ అనే లాయర్ పాత్ర చేశాను. పబ్లిక్‌ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఆడియన్స్ ఇప్పటివరకూ చూసి ఉండరని నా అభిప్రాయం. ఈ సినిమా కోసం నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది. ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ‘పట్టుకుంటే పదివేలు’ అనే కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు (ఆడియన్స్) స్పాట్లో పది వేలు ఇస్తారు. ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఆ కూపన్లో విలన్ ఎవరో చెప్పి... సెకండాఫ్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్లో పది వేలు ఇస్తారు. ఇలా 50 సెంటర్స్‌లో ఇవ్వబోతున్నాం’’ అని అన్నారు.‘‘ఈ సినిమాలో సాయిరామ్ శంకర్‌ను కొత్తగా చూస్తారు’’ అన్నారు వినోద్. ‘‘ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’’ అని కోరారు గార్లపాటి రమేశ్. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే 300 థియేటర్స్‌కు తగ్గకుండా ఈ చిత్రం ప్రదర్శితమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశాం’’ అని తెలిపారు శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు. -
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
12 ఏళ్ల తర్వాత సాయిరామ్ శంకర్‌కు మళ్లీ ‘బంపర్ ఆఫర్’
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 'బంపర్ ఆఫర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సాయిరామ్ శంకర్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2’ పేరుతో ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుంది. ‘బంపర్ ఆఫర్’ విడుదలైన 12 సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ యల్లంరాజుతో కలిసి సాయిరామ్ శంకర్ నిర్మిస్తుండటం విశేషం. అశోక స్క్రిప్ట్ అందించాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సురేష్ యల్లంరాజు వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పప్పు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. చదవండి: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్ -
హిట్ ట్రాక్ ఎక్కేశావంటున్నారు
‘‘హిట్ ట్రాక్ ఎక్కేశావ్ సాయి. ఇప్పట్నుంచీ నీ అసలు సిసలైన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది చూడ’ని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు సాయిరామ్ శంకర్. ఆయన హీరోగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ శుక్రవారం విడుదలైంది. ఈ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సాయిరామ్ శంకర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘చాలా రోజులుగా ఇంత మంచి హిట్ కోసం వెయిటింగ్. ప్రతి ఏరియా నుంచి సూపర్‌హిట్ టాక్ వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదిది. ఓ సందేశం ఇస్తూ, థియేటర్లలో చివరి వరకూ ఉత్కంఠగా కూర్చోబెట్టడమనేది ప్రేక్షకులకు నచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాకూ, శరత్‌కుమార్‌గారికి మధ్య వచ్చే సీన్లు వాళ్లకు బాగా నచ్చాయి. రిలీజ్‌కు ముందే అన్నయ్య (పూరి జగన్నాథ్)కు సినిమా చూపించా. ‘సెకండాఫ్ చాలా బాగుంది. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించింది’ అన్నారాయన. ప్రేక్షకులూ అదే అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘డేంజర్’, ‘హాలో ప్రేమిస్తా’ వంటి థ్రిల్లర్స్, కొత్త తరహా చిత్రాలను సాయిరామ్ శంకర్ పదేళ్ల క్రితమే చేశారు. అటువంటి సినిమాలు చేయడం ప్రజెంట్ ట్రెండ్. ఆ సినిమాలను ఎర్లీగా చేశాననుకుంటున్నారా? అని సాయిరామ్ శంకర్‌ని అడగ్గా... ‘‘అంతే కదా! నా కెరీర్ ఎలా ఉండాలని నేననుకున్నానో అలాంటి ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత సక్సెస్ జర్నీ కంటిన్యూ కావల్సింది. మధ్యలో చేసిన కొన్ని సినిమాల వల్ల కుదరలేదు. ఇకపై ట్రెండ్‌కి తగ్గట్టుండే సినిమాలు చేస్తా. ప్రస్తుతం చేస్తున్న ‘వాడు నేను కాదు’ ట్రెండీ సినిమానే. నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్లో న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలనుంది’’ అన్నారు. -
కొత్త రకం...
‘‘సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ రెడ్డి. రామ్‌శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ ఈ నెల 17న రిలీజవుతోంది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సుదర్శన్ నా స్నేహితుడే. కాంటెంపరరీ ఇష్యూ స్ఫూర్తితో కథ రెడీ చేశాడు. కంటెంట్ పరంగా, కమర్షియల్‌గా డెప్త్ ఉన్న ఈ కథ విని ఆర్టిస్టులందరూ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. కథ, కథనం హైలెట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అదే విధంగా కమర్షియల్ సినిమాల్లో ఇదో కొత్త రకం అనే టాక్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
మళ్లీ సక్సెస్ దండయాత్ర షురూ చేశా : సాయిరామ్ శంకర్
‘‘సాయిరామ్ శంకర్ చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ప్రయత్నిస్తూ, ఇలాగే ముందడుగు వేయాలి. ‘గడ్డం..’ సాంగ్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమాతో అతనికి మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను’’ అని హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. సాయిరామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరి నిర్మించిన సినిమా ‘అరకు రోడ్లో...’. రాహుల్‌రాజ్, వాసుదేవ్ స్వరపరిచిన పాటల సీడీలను దర్శకుడు పూరి జగన్నాథ్, థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కల్యాణ్‌రామ్ విడుదల చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో అమ్మాయిలను చూస్తే హీరోకి నత్తి వస్తుంది. మహా భయస్థుడు. దర్శకుడు నా పాత్రను బాగా డిజైన్ చేశారు. మా టీమ్ అందరూ బాగా కష్టపడి చేశారు. సక్సెస్ కోసం సాయి దండయాత్ర చేస్తున్నాడని ఎవరో రాశారు. అలా చేయకపోతే తప్పే. ‘అరకు రోడ్లో’తో సక్సెస్ కోసం మళ్లీ దండయాత్ర షురూ చేశా. ఈసారి సక్సెస్ అవుతుందని ఆశిసున్నా’’ అన్నారు. హీరో సాయిరామ్ శంకర్ కుమార్తె జనన్య ఈ చిత్రంలో నటించారని నిర్మాత బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ వేడుకలో అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్‌రావు, నటులు ఆకాశ్ పూరి, కమల్ కామరాజు, హీరోయిన్లు నికిషా పటేల్, సంజన, దీక్షాపంత్ పాల్గొన్నారు. -
ఏ రకం?
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తె రకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సమాజంలో ఉన్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ చిత్రం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్నాం. సాయిరామ్ శంకర్ లేకుంటే ఈ చిత్రం చేసేవాళ్లం కాదు. శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన రాధికగారు తమిళంలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిత్ మంచి పాటలిచ్చాడు. మే మొదటి వారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తదితరులు మాట్లాడారు. -
థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘నేనో రకం’. వంశీధర్ రెడ్డి సమర్పణలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘మారిన తెలుగు సినిమా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందింది. హీరోగా నా కెరీర్‌కు ఉపయోగపడే చిత్రమిది’’ అని అన్నారు. మా చిత్రం ఎన్నో వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ, సరికొత్త థ్రిల్ అందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. -
సాయిరామ్ శంకర్ కొత్త చిత్రం స్టిల్స్
-
నేనేంటో నిరూపించుకుంటా
కోటవురట్ల: వర్ధమాన హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ సంక్రాంతి పండుగను తన స్వగ్రామం బి.కె.పల్లిలో కుటుంబ సభ్యుల నడుమ ఆనందంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక విలేకరులతో సరదాగా ముచ్చటించారు... అవి ఆయన మాటల్లోనే... చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి... పండగకు ఇక్కడకు రాగానే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. చిన్ననాటి స్నేహితులతో భుజాలపై చేతులు వేసి తీర్థంలో తిరగాలని ఆశగా ఉంది.. పండుగను అమ్మతో పంచుకోవడం సంతోషాన్ని కలిగించింది. ఈ సంతోషంలో గణి(నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్) కూడా పాలు పంచుకున్నారు. సినిమాలతో బిజిబిజీ ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ రెండు సినిమాలు విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ‘వాడు నేను కాదు’ సినిమా విశాఖలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకొంది. ఇంకా ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ఈ సినిమా 4 భాషల్లో రూపొందుతోంది. అలాగే మరో సినిమా ‘అరకురోడ్డులో’ కూడా శరవేగంగా తయారవుతోంది. ఇంకా పేరుపెట్టని సినిమాలో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్నాను. వాడు నేను కాదులో లవ్, ఏక్షన్, మిస్టరీ మిళితమై ఉంటాయి. కాగా అరకు లోయలో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. మరో కొత్త సినిమా ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. దీంతో చేతినిండా సినిమాలతో ఈ ఏడాదంతా బిజీగా ఉన్నాను. దర్శకత్వం చేయాలని.. నటుడిగా మంచి గుర్తింపు వచ్చాక దర్శకత్వం చేయాలని ఉంది. అన్నయ్య ఇచ్చిన 143తో లవర్‌బాయ్ ఇమేజ్ రాగా ‘బంపర్ ఆఫర్’ సినిమా మాస్ ఇమేజ్ను అందించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నిటిలో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే. అంతేకాదు ప్రొడక్షన్ రంగంలో కూడా నేనేంటో నిరూపించుకుంటా. -
అవును... కామెడీ సుధాకర్ మళ్లీ వచ్చాడు!
నాయకుడు, ప్రతినాయకుడు, హాస్యనటుడు, సహాయ నటుడు... ఇలా అన్ని పార్శ్వాల్లోనూ భేష్ అనిపించుకునే నటులు కొంతమందే ఉంటారు. అలాంటివారిలో సుధాకర్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో తిరుగులేని కథానాయకుడు అనిపించుకొని, తెలుగులో ‘కింగ్ ఆఫ్ కామెడీ’ అన్నంత పేరు తెచ్చుకున్న సుధాకర్ చాలా కాలం తరువాత మళ్ళీ కెమేరా ముందుకు వచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ (సాయిరామ్ శంకర్) హీరోగా నటిస్తున్న ‘వాడు నేను కాదు!’ సుధాకర్ కమ్‌బ్యాక్ మూవీ. సంభాషణలు పలికే తీరులో ప్రత్యేక శైలి కనబరిచే సుధాకర్ ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొన్న జూన్ 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. సుధాకర్‌ను అభిమానించేవారికి ఇది నిజంగా తీపి కబురే. సుధాకర్ కమ్‌బ్యాక్ ఎలా జరిగిందంటే... హీరో రామ్ శంకర్ ఆ మధ్య తన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ఎడిటింగ్ కోసం, దర్శకుడు సుదర్శన్‌తో కలసి ఒక ఎడిటింగ్ సూట్‌కు వెళ్ళారట. తీరా చూస్తే, అది కమెడియన్ సుధాకర్ ఇల్లనీ, ఎడిటింగ్ సూట్ పై భాగంలోనే ఆయన ఉంటారనీ తెలిసి, ఆయనను కలిశారు. ‘‘పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయనను పలకరించి, మళ్ళీ సినిమాల్లో నటిస్తే బాగుంటుందన్నాం. మొదట ఆయన మొహమాటపడ్డారు. కొన్నాళ్ళ తరువాత ఓ.కె. అన్నారు. ఆ విషయం దర్శక - నిర్మాత వినోద్ విజయన్‌కు చెప్పగానే, అయిదు భాషల్లో తీస్తున్న ‘వాడు నేను కాదు!’లో ఒక మంచి పాత్ర సుధాకర్‌కు ఇచ్చారు’’ అని రామ్‌శంకర్, ‘సాక్షి’కి వివరించారు. ‘‘ఏడేళ్ళ విరామం తరువాత మళ్ళీ కెమేరా ముందుకు’’ వచ్చిన సుధాకర్ ఈ చిత్రంలో హీరోకు మేనమామగా, కథతో లింకున్న ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నారు. చాలా కాలంగా ఇంట్లో ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్లకే పరిమితమై, ఇన్నాళ్ళకు మళ్ళీ షూటింగ్‌కు వచ్చిన సుధాకర్‌కు సెట్ వాతావరణం మళ్ళీ కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చిందని యూనిట్ సభ్యులు చెప్పారు. సీన్ పేపర్ ముందుగా చదువుకొని, నటనకు సిద్ధమవుతున్న తీరు చూస్తుంటే, మళ్ళీ పాత సుధాకర్‌ను చూసినట్లుందట! నేనిప్పుడు బ్రహ్మాండంగా ఉన్నా! - సుధాకర్ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ‘‘ఇప్పుడు చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ ఫిట్ ఎగైన్ నౌ’’ అని సుధాకర్ తాజాగా ప్రకటించారు. కాగా, సుధాకర్‌కి సినిమాలు తగ్గడానికి కారణం ఆయన మద్యానికి బానిస కావడమే అన్న అభిప్రాయం పలువురికి ఉంది. ఈ విషయం గురించి సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకంటూ కొన్ని నియమాలు, పద్ధతులు ఉండేవి. యోగా చేసేవాణ్ణి. నేను వేసే క్లిష్టమైన ఆసనాలు చాలామంది వేయలేరు కూడా! రోజూ యోగా చేశాకే షూటింగ్‌కు వెళ్లేవాణ్ణి. అంతేకానీ, చాలామంది ఊహించినట్లు నేను అదే పనిగా తాగుతూ ఉండేవాణ్ణి కాదు. షూటింగ్ నుంచి వచ్చాక రిలాక్సేషన్ కోసం కొద్దిగా డ్రింక్ చేసేవాణ్ణి. వృత్తి విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండేవాణ్ణి. అలా ఉన్నాను కాబట్టే, నాలుగు వందల సినిమాల వరకూ చేయగలిగాను. మధ్యలో ఆరోగ్యం బాగాలేకే సినిమాలకు దూరంగా ఉన్నాను తప్ప, వేరే కారణాలేవీ లేవు. ఒక మంచి పాత్ర ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది’’ అని సుధాకర్ చెప్పారు. ‘బిష... బిష’ అంటూ వెరైటీ కామెడీతో ఒకప్పుడు అందర్నీ నవ్వించిన సుధాకర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ అంత వినోదం పంచితే, ప్రేక్షకులకు అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి! -
క్రిమినల్ లాయర్‌గా పూరీ సోదరుడు
హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రేమికుడు, రోమియో, పోకిరీ తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్... తాజాగా 'వాడు నేను కాదు' చిత్రంలో క్రిమినల్ లాయర్ పాత్రను పోషించనున్నాడు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నికి వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ క్రిమినల్ లాయర్ బిగ్ పజిల్‌ను ఎలా ఛేదించాడు అనేది ఈ చిత్రం ద్వారా చూడవచ్చని చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భోజ్‌పూరి భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిరాం శంకర్‌కి దర్శకుడు విజయన్‌కు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా ఈ చిత్ర కథపై జరిగాయని... అయితే అవి ఇటీవల కొలిక్కి రావడంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని వివరించింది. నటి మహిమ నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది. అలాగే మరో నటిని ఎంపిక చేయవలసి ఉందని... అందుకోసం ఇప్పటికే చిత్ర దర్శకుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంది. వివిధ చిత్రాలకు పని చేసి పలు అవార్డులు అందుకున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని చిత్ర యూనిటి తెలిపింది. ఈ చిత్రంలో సాయిరాం ద్విపాత్రాభినయం చేయనున్నాడు. -
అయిదు భాషల్లో హంగామా!
హీరో సాయిరామ్ శంకర్‌ను ఇక నుంచి రామ్ శంకర్‌గా పిలవాలి. ఆ పేరుతోనే ఆయన ‘వాడు నేను కాదు’ సినిమా చేస్తున్నారు. ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి పనిచేస్తున్న ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు. వినోద్ విజయన్ దర్శకత్వంలో రవి పచ్చ ముత్తు, కె. మోహనన్, వినోద్ విజయన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ సినీవేడుకలో పాల్గొని కెమెరా స్విచాన్ చేయడం విశేషం. అలాగే ఈ వేడుకలో ప్రపంచలోనే అతిపెద్ద శ్రీచక్రంను ఏర్పాటు చేయడం మరో విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాతో తనకు బ్రేక్ రావడం ఖాయమని రామ్ శంకర్ నమ్మకం వ్యక్తపరిచారు. ఇందులో రామ్ శంకర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని దర్శకుడు చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. తమిళంలో ఏడు సినిమాలు చేసిన తనకిది తొలి తెలుగు చిత్రమని కథానాయిక మహిమా నంబియార్ చెప్పారు. ఏఎమ్ రత్నం, పూరి జగన్నాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
స్టార్ రిపోర్టర్ : సాయిరామ్ శంకర్
-
సినిమా రివ్యూ: రోమియో
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ప్రేమ కథ అంటూ భారీ బిల్డప్ కారణంతో చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీగానే 'రోమియో' ఆశలు అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సినీ ప్రేమికులకు రోమియో చాలా కాలంగానే దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు అక్టోబర్ 10(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోమియో ఎలాంటి ఫలితాన్ని చవిచూశాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ఒంటరిగా ట్రావెలింగ్ చేయడమంటే అంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి యూరప్ పర్యటనకు వెళ్తుంది. యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీలోని రోమ్ చేరుకుంటుంది. రోమ్ నగరంలో సమంతను కిట్టు (సాయిరాం శంకర్) చూసి వెంటాడటం ప్రారంభిస్తాడు. ప్లాన్ ప్రకారం సమంతకు దగ్గరై పాస్ పోర్ట్ ను తన దగ్గరే పెట్టుకుని ఏడిపిస్తుంటాడు. కావాలనే తన పాస్ పోర్ట్ తన వద్ద పెట్టుకుని ఏడిపిస్తున్నాడని తెలుసుకున్న సమంత.. కిట్టూని నిలదీస్తుంది. దాంతో కిట్టు తన ఫ్యాష్ బ్యాక్ ను చెపుతాడు. అయితే కిట్టు ఫ్లాష్ బ్యాక్ కు, సమంతకు లింకేమిటి? ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, ఆలీ, జయసుధ, నాగబాబులకు పాత్రల ఎంటీ? కిట్టు, సమంతల కథ చివరకు ఏమైందనేదే 'రోమియో' సినిమా. ఆకట్టుకునే అంశాలు: యూరప్, ముఖ్యంగా రోమ్ నగర అందాలు పీజీ విందా ఫోటోగ్రఫి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిరాశ పరిచే అంశాలు: కనీస స్థాయిలో కూడా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకోకపోవడం తలా తోకాలేని కథ పట్టులేని కథనం నటీనటుల పనితీరు విశ్లేషణ: కిట్టూగా పూరి సోదరుడు సాయిరాం శంకర్, సమంతగా అడోనికలు నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో, కథనం సాదాసీదాగా ఉండటం, తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ప్రేక్షకుడ్ని ఓ స్థాయిలోనూ ఆకట్టుకోని విధంగా ఉంది. హీరో కారెక్టర్ ఎంటో, యూరప్ ఎందుకెళ్లాడో అనే చిన్న లాజిక్ ను కూడాదర్శకుడు పట్టించుకోలేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశాల్లో ఒకటి. కనీసం వైజాగ్ లో పద్దుతో హీరో ప్రేమ కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించగలిగి ఉండే కొంత సమంజసంగా ఉండేదేమో. ఇక మధ్య మధ్యలో రవితేజ, ఆలీ కనిపించడం కొంత ఊరటతోపాటు, కొంత హాస్యాన్ని పండించినా..సినిమాకు బలంగా మారుతుందని చెప్పడం కష్టమే. ఓ సినిమా కన్నా ట్రావెల్ గైడ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే దర్శకుడు దృష్టి సారించారా అనిపిస్తుంది. సినిమా కంటే యూరప్ అందాలే ప్రేక్షకుడికి కొంత ఊరటనిచ్చాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పీజి విందా ఫోటోగ్రఫి మాత్రమే. ఇక సునీల్ కాశ్యప్ సంగీతం కూడా అంతంతమాత్రేమే. పాటలు కూడా ఆలరించలేకపోయాయి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారలేకపోయింది. పూరి రాసిన ప్రేమకథ ఇంత నాసిరకంగా ఉంటుందా? లేదా ఆయన చెప్పిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారా అనే ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడటం చాలా కామన్ పాయింట్ గా మిగిలింది. పూరి మదిలో మెదిలిన 'రోమియో' ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేదా అనే మిలియన్ డాలర్ ప్రశ్నే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
‘రోమియో’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
అన్నయ్యలా డెరైక్షన్ చేస్తా
సినీహీరో సాయిరామ్ శంకర్ కోటవురట్ల, న్యూస్‌లైన్ : పూరీ అన్నయ్యలా డైరక్షన్ చేయాలని ఉందని వర్ధమాన యువ హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సాయిరామ్ శంకర్ సంక్రాంతి పండుగను తన స్వంత ఊళ్లో కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు తన స్వగ్రామమైన బి.కె.పల్లికి వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు...ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. డెరైక్షన్ అంటే ఇష్టం... డైరక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏడేళ్లపాటు పూరీ అన్నయ్య వద్ద శివమణి సినిమా వరకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశాను. హీరోగా ఇప్పటి వరకు 9 సినిమాలు చేశాను. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి... 143, బంపర్ ఆఫర్... మంచి పేరు తెచ్చాయి... ఇడియట్, నేనింతే సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాను. నేను నటించిన 143, బంపర్ ఆఫర్ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి..అవి నాకిష్టమైన సినిమాలు. బంపర్ ఆఫర్ సినిమాకు పూరీ అన్నయ్య కథ మాటలు అందించారు. అన్నయ్య డెరైక్షన్‌లో నటించాలని... అన్నయ్య బిజీగా ఉండడం వల్ల అన్నయ్య డైరక్షన్లో నటించే అవకాశం కలగలేదు. అన్నయ్యకు నేను, గణేష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం ఎప్పుడూ మా క్షేమాన్ని ఆయన ఆశిస్తారు. అందుకే తాను బిజీగా ఉన్నప్పటికీ నేను నటించిన రోమియో, దిల్లున్నోడు (రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి) సినిమాలకు కథ, మాటలు ఇచ్చారు. త్వరలో మూడు సినిమాల్లో... ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్లో ఒకటి సినిమాలు అంగీకరించాను. తమిళ్ సినిమా ఈ నెలాఖరు ప్రారంభమవుతుంది. కొత్త సినిమా కోసమే ఈ గెడ్డం పెంచుతున్నా. కథ నచ్చితే ఏ పాత్ర అయినా... నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కథ నచ్చితే ఏ పాత్రనైనా చేస్తాను. గణేష్ అన్నయ్య(వైఎస్సార్ సీపీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల్లో పోటీ చేస్తే నేను, పూరీ అన్నయ్య కూడా ప్రచారం చేస్తాం. ఉదయ్ ఉదంతం బాధ కలిగించింది... ఉదయ్‌కిరణ్‌తో నాకు పరిచయం ఉంది.. తను చాలా దృఢమైన మనస్తత్వం ఉన్నవాడు... కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. సొంతూళ్లోనే సంక్రాంతి ఎంత హీరో అయినా నేను మా గ్రామంలో సాయిని మాత్రమే. పాత మిత్రులు, వారితో చేసిన అల్లరి పనులు గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి పండుగను స్వంత ఊళ్లో,కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొంటాను. -
1000 అబద్ధాలు ప్రేక్షకులు నమ్మారు
‘‘మా సినిమా సూపర్‌హిట్ అయ్యిందని నేను అనను. చూసిన వాళ్లందరూ మెచ్చుకుంటున్నారని మాత్రం చెప్పగలను’’ అని తేజ అన్నారు. సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా తేజ దర్శకత్వంలో పాలడుగు ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘1000 అబద్ధాలు’. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తేజ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదలవ్వడంతో వసూళ్ళను ఈ నాలుగు సినిమాలు పంచుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం మా సినిమా వసూళ్లు పెరిగాయి. దీన్ని బట్టి సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యిందని తెలుస్తోంది. కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాలు థియేటర్లకు వస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందీ సినిమా. ముఖ్యంగా టవర్‌స్టార్‌గా నాగబాబు కామెడీ బావుందంటున్నారు’’ అన్నారు. సినిమా చూసిన వారందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని సాయిరామ్‌శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాత్రను ఇందులో పోషించానని కథానాయిక ఎస్తర్ చెప్పారు. ఈ సినిమాలో తామూ భాగమైనందుకు నటుడు సామ్రాట్, నవీన్ ఆనందం వ్యక్తం చేశారు.