
1000 అబద్ధాలు ప్రేక్షకులు నమ్మారు
‘‘మా సినిమా సూపర్‌హిట్ అయ్యిందని నేను అనను. చూసిన వాళ్లందరూ మెచ్చుకుంటున్నారని మాత్రం చెప్పగలను’’ అని తేజ అన్నారు. సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా తేజ దర్శకత్వంలో పాలడుగు ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘1000 అబద్ధాలు’. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది
‘‘మా సినిమా సూపర్‌హిట్ అయ్యిందని నేను అనను. చూసిన వాళ్లందరూ మెచ్చుకుంటున్నారని మాత్రం చెప్పగలను’’ అని తేజ అన్నారు. సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా తేజ దర్శకత్వంలో పాలడుగు ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘1000 అబద్ధాలు’. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తేజ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదలవ్వడంతో వసూళ్ళను ఈ నాలుగు సినిమాలు పంచుకోవడం జరిగింది.
ఈ రోజు మాత్రం మా సినిమా వసూళ్లు పెరిగాయి. దీన్ని బట్టి సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యిందని తెలుస్తోంది. కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాలు థియేటర్లకు వస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందీ సినిమా. ముఖ్యంగా టవర్‌స్టార్‌గా నాగబాబు కామెడీ బావుందంటున్నారు’’ అన్నారు. సినిమా చూసిన వారందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని సాయిరామ్‌శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాత్రను ఇందులో పోషించానని కథానాయిక ఎస్తర్ చెప్పారు. ఈ సినిమాలో తామూ భాగమైనందుకు నటుడు సామ్రాట్, నవీన్ ఆనందం వ్యక్తం చేశారు.