25 కుక్కలతో యాక్షన్‌ సీన్‌.. అదే హైలెట్‌: హీరో సాయి రామ్ శంకర్ | Hero Sai Ram Shankar Talk About Oka Pathakam Prakaaram Movie | Sakshi
Sakshi News home page

25 డాగ్స్‌తో షూటింగ్‌.. ఓ కుక్క అటాక్‌ చేయడంతో..: హీరో సాయి రామ్ శంకర్

Published Tue, Feb 4 2025 4:15 PM | Last Updated on Tue, Feb 4 2025 4:47 PM

Hero Sai Ram Shankar Talk About Oka Pathakam Prakaaram Movie

'ఒక పథకం ప్రకారం'సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ కోసం 25 డాగ్స్‌ని తెచ్చారు. వాటితో ఫైట్‌ సీన్‌ షూట్‌ చేస్తుంటే.. ఓ కుక్క నాపై అటాక్‌ చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కడినే గ్రిల్‌లో ఉన్నాను. భయంతో గ్రిల్‌ ఎక్కేశాను. ఆ పని చేయకపోతే ఆ డాగ్‌ నన్ను కచ్చితంగా కరిచేది. రిస్క్‌ చేసి తీసిన ఆ యాక్షన్‌ సీన్‌ అదిరిపోయింది’ అన్నారు హీరో సాయి రామ్‌ శంకర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సాయి రామ్‌ శంకర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

'ఒక పథకం ప్రకారం' అంటే 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం.

వినోద్ కుమార్ విజయన్ మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు డైరెక్టర్ విజయన్. కాబట్టి తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఫైట్ సీన్స్ ని, సాంగ్స్ ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.

నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.

గతంలో ఇలాంటి ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్ గా చేశామన్న సంతృప్తి లభించింది.

ఇప్పటికి తెలుగులో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. నెక్స్ట్ ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్ గారు ఇండియన్ టాప్ కెమెరామన్లలో ఒకరు. అలాగే మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కూడా నేర్చుకున్నారు.

మా సినిమా రిలీజ్‌ రోజే తండేల్‌ కూడా వస్తోంది. అయితే ఆ సినిమాతో మాకు పోటీ లేదు. అది చాలా పెద్ద సినిమా. మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం(నవ్వుతూ..)

ప్రస్తుతం ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement