అన్నయ్యలా డెరైక్షన్ చేస్తా | sairam shankar interview | Sakshi
Sakshi News home page

అన్నయ్యలా డెరైక్షన్ చేస్తా

Published Tue, Jan 14 2014 2:01 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

sairam shankar interview

సినీహీరో సాయిరామ్ శంకర్
 
 కోటవురట్ల, న్యూస్‌లైన్ : పూరీ అన్నయ్యలా డైరక్షన్ చేయాలని ఉందని వర్ధమాన యువ హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సాయిరామ్ శంకర్ సంక్రాంతి పండుగను తన స్వంత ఊళ్లో కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు తన స్వగ్రామమైన బి.కె.పల్లికి వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు...ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..

 
 డెరైక్షన్ అంటే ఇష్టం...

 డైరక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏడేళ్లపాటు పూరీ అన్నయ్య వద్ద శివమణి సినిమా వరకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశాను. హీరోగా ఇప్పటి వరకు 9 సినిమాలు చేశాను. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి...

 143, బంపర్ ఆఫర్... మంచి పేరు తెచ్చాయి...

 ఇడియట్, నేనింతే సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాను. నేను నటించిన 143, బంపర్ ఆఫర్ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి..అవి నాకిష్టమైన సినిమాలు. బంపర్ ఆఫర్ సినిమాకు పూరీ అన్నయ్య కథ మాటలు అందించారు.
 
 అన్నయ్య డెరైక్షన్‌లో నటించాలని...

 అన్నయ్య బిజీగా ఉండడం వల్ల అన్నయ్య డైరక్షన్‌లో నటించే అవకాశం కలగలేదు. అన్నయ్యకు నేను, గణేష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం ఎప్పుడూ మా క్షేమాన్ని ఆయన ఆశిస్తారు. అందుకే తాను బిజీగా ఉన్నప్పటికీ నేను నటించిన రోమియో, దిల్లున్నోడు (రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి) సినిమాలకు కథ, మాటలు ఇచ్చారు.
 
 త్వరలో మూడు సినిమాల్లో...

 ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్‌లో ఒకటి సినిమాలు అంగీకరించాను. తమిళ్ సినిమా ఈ నెలాఖరు ప్రారంభమవుతుంది. కొత్త సినిమా కోసమే ఈ గెడ్డం పెంచుతున్నా.
 
 కథ నచ్చితే ఏ పాత్ర అయినా...


 నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కథ నచ్చితే ఏ పాత్రనైనా చేస్తాను. గణేష్ అన్నయ్య(వైఎస్సార్ సీపీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల్లో పోటీ చేస్తే నేను, పూరీ అన్నయ్య కూడా ప్రచారం చేస్తాం.
 
 ఉదయ్ ఉదంతం బాధ కలిగించింది...

 ఉదయ్‌కిరణ్‌తో నాకు పరిచయం ఉంది.. తను చాలా దృఢమైన మనస్తత్వం ఉన్నవాడు... కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదు.
 
 సొంతూళ్లోనే సంక్రాంతి

 ఎంత హీరో అయినా నేను మా గ్రామంలో సాయిని మాత్రమే. పాత మిత్రులు, వారితో చేసిన అల్లరి పనులు గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి పండుగను స్వంత ఊళ్లో,కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొంటాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement