'అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న నటుడ్ని నేనే' | I am the highest paid actor in Bollywood today, says Nawazuddin | Sakshi
Sakshi News home page

'అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న నటుడ్ని నేనే'

Published Sun, Aug 20 2017 7:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న నటుడ్ని నేనే' - Sakshi

'అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న నటుడ్ని నేనే'

బాలీవుడ్‌ విలక్షణ నటుడిగా అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌, ద లాంచ్‌బాక్స్‌, రమణ్‌రాఘవ్‌ 2.0 వంటి సినిమాలతో సంక్లిష్టమైన పాత్రలను కూడా తనదైన శైలిలో రక్తి కట్టించగలడని ఆయన నిరూపించుకున్నాడు.

తాజాగా ఇండియా టీవీ నిర్వహించే 'ఆప్‌ కి అదాలత్‌'లో పాల్గొన్న నవాజుద్దీన్‌ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. నటనపరంగా బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుడిని తానేనని చెప్పాడు. ఇంత రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని తాను అడుగకపోయినా, నిర్మాతలే తనకు అధికమొత్తంలో చెల్లిస్తున్నారని తెలిపాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటులకు హాలీవుడ్‌ మోజు ఎక్కువైనట్టు కనిపిస్తున్నదని, తమ కన్నా అగ్రస్థానంలో ఉన్నవారిని చూసినప్పుడు ఇలాంటి నూన్యతభావం కలుగడం సహజమని ఆయన చెప్పాడు. కానీ కంటెంట్‌పరంగా బాలీవుడ్‌లో మంచి సినిమాలు వస్తున్నాయని, ఈ విషయంలో మనమంతా గర్వపడాలని ఆయన తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement